ప్రభుత్వ బడుల్లో మెరుగైన విద్యాబోధన
గద్వాలటౌన్: ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు మెరుగైన విద్య అందుతోందని డీఈఓ విజయలక్ష్మి అన్నారు. జిల్లాలో ఏర్పాటుచేసిన బాలబడుల్లో ప్రీ ప్రైమరీ తరగతులు నిర్వహించే ఇన్‌స్టక్టర్లకు మంగళవారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈ ఓ మాట్లాడుతూ.. చాలా మంది పిల్లలు ప్రైవేటులో ప్రీ ప్రైమరీ చదువుతుండటంతో ఎన్‌రోల్‌మెంట్ తగ్గుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థు ల సంఖ్య పెంపు, తల్లిదండ్రులపై ఆర్థికభారం తగ్గించడం కోసం ప్రభుత్వం బాలబడులను ఏర్పా టు చేసిందన్నారు. ప్రభుత్వ బడుల్లో ప్రీ ప్రైమరీ తరగతులతో విద్యా ప్రమాణాలు మెరుగుపడుతాయని అన్నారు. అనంతరం బాలబడుల పుస్తకా న్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో అదికారులు ప్రతాప్‌రెడ్డి, హంపయ్య, శాంతిరాజు, రేణుక, డీఆర్పీలు రాజవర్ధన్, జయమ్మ, వెంకటేశ్ ఉన్నారు.


