ఆయిల్‌పాం సాగు లాభదాయకం
ఉండవెల్లి: ఆయిల్‌పాం సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని జిల్లా ఉద్యానశాఖ అధికారి అక్బర్ అన్నారు. మంగళవారం ఉండవెల్లి మండలం కలుగోట్ల రైతువేదికలో ఆయిల్‌పాం సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. సుదీర్ఘకాలం వచ్చే ఆయిల్‌పాం దిగుబడులతో రైతులు లాభాలు ఆర్జించవచ్చన్నారు. జిల్లాలో ఆయిల్‌పాం సాగును ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రాయితీలు అందిస్తున్నాయని.. రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆయిల్‌ఫెడ్ జిల్లా ఇన్‌చార్జి శివనాగిరెడ్డి, ఏఓ అనిత, పీఏసీఎస్ చైర్మన్ గజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


