ఆదిశిలావాసుడి ప్రచార రథం ప్రారంభం
మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ప్రచార రథం, వాల్‌పోస్టర్లను ఆదివారం ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, ఈఓ సత్యశ్చంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంగళవారం నుంచి వచ్చేనెల 6 వరకు జరగనున్న స్వామివారి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసేందుకు అందరూ తమవంతుగా కృషిచేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు తిమ్మారెడ్డి, సీతారామిరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, బాబురావు, చంద్రశేఖర్‌రావు, వీరారెడ్డి, అర్చకులు మధుసూదనాచారి, రమేషాచారి, రవిచారి, వాల్మీకి పూజారులు పాల్గొన్నారు.


