జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా రాజీవ్‌రెడ్డి | - | Sakshi
Sakshi News home page

జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా రాజీవ్‌రెడ్డి

Nov 23 2025 9:03 AM | Updated on Nov 23 2025 9:03 AM

జిల్ల

జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా రాజీవ్‌రెడ్డి

గద్వాల: జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా ఎం.రాజీవ్‌రెడ్డిని నియమించారు. ఈ మేరకు శనివారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ డీసీసీ అధ్యక్షుల జాబితాను విడుదల చేశారు. ధరూరు మండలం కాపులకుంటకు చెందిన రాజీవ్‌రెడ్డిని డీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక చేశారు. ఆయన మున్నూరుకాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. దశాబ్దన్నర కాలంగా కాంగ్రెస్‌ పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా అధ్యక్షుడిగా ఎంపిక చేయడంపై మున్నూరుకాపు సామాజిక వర్గం, రాజీవ్‌రెడ్డి అభిమానులు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు హర్షం వ్యక్తంచేశారు.

‘పంచాయతీ’

రిజర్వేషన్లు ఖరారు

గద్వాల: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అధికారులు పంచాయతీల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేశారు. మొత్తం 255 సర్పంచ్‌ స్థానాలు ఉండగా.. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లను శనివారం లక్కీడిప్‌ ద్వారా కేటాయించారు. మొత్తం సర్పంచ్‌ స్థానాలకు రొటేషన్‌ విధానంలో రిజర్వేషన్‌ ప్రక్రియను పూర్తిచేశారు. ఈ జాబితాను రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖకు నివేదించనున్నారు. కాగా, జిల్లాలో ఇదివరకే గ్రామపంచాయతీల వారీగా నూతన ఓటర్ల జాబితాను సిద్ధం చేశారు. ఇందులో ఒక కుటుంబానికి చెందిన ఓట్లు ఒకే వార్డులో ఉండేలా చేర్పు, మార్పులు చేపట్టారు. గత జూలై 1న రూపొందించిన ఓటరు జాబితా ప్రమాణికంగా ముసాయిదా జాబితాను విడుదల చేశారు. అభ్యంతరాల స్వీకరణ అనంతరం సెప్టెంబర్‌ 2న తుది జాబితాను విడుదల చేసిన విషయం విదితమే. తాజాగా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు మొదలుపెట్టిన నేపథ్యంలో ఓటరు దరఖాస్తుల అభ్యంతరాల స్వీకరణ, తప్పుల సవరణ వంటి ప్రకియను పూర్తిచేసి.. తుది ఓటరు జాబితాను ఆయా పోలింగ్‌ కేంద్రాల్లో ప్రచురించనున్నారు.

మెరుగైన విద్య

అందించాలి

మల్దకల్‌: విద్యార్థులకు మెరుగైన విద్య అందించి.. వారి ఉన్నతికి కృషి చేయాలని డీఈఓ విజయలక్ష్మి ఉపాధ్యాయులకు సూచించారు. శనివారం మండలంలోని అమరవాయి ఉన్నత పాఠశాలలో ఆమె ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతో పాటు విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను తెలుసుకున్నారు. అనంతరం కాంప్లెక్స్‌ సమావేశానికి డీఈఓ హాజరై మాట్లాడారు. పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలన్నారు. చదువులో వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని డీఈఓ పరిశీలించారు. ఆమె వెంట ఎంఈఓ సురేశ్‌, జీహెచ్‌ఎం నరేశ్‌ ఉన్నారు.

సెమిస్టర్‌ పరీక్షల ఫలితాలు విడుదల

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పీయూలో వివిధ కోర్సులకు సంబంధించిన పరీక్ష ఫలితాలను వీసీ శ్రీనివాస్‌ శనివారం విడుదల చేశారు. బీఈడీ సెమిస్టర్‌ 2లో 71.98 శాతం, బీఈడీ 4వ సెమిస్టర్‌లో 93.48 శాతం, ఎల్‌ఎల్‌బీ 2వ సెమిస్టర్‌లో 68.85 శాతం, ఎల్‌ఎల్‌బీ 4వ సెమిస్టర్‌లో 86.85 శాతం, బీ ఫార్మసీ 4వ సెమిస్టర్‌ 60.40 శాతం, భీపార్మసీ 6వ సెమిస్టర్‌ 57.77 శాతం, ఎంఫార్మసీ 2వ సెమిస్టర్‌లో 72.22 శాతం, బీపెడ్‌ 2వ సెమిస్టర్‌లో 87.13 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు కంట్రోలర్‌ ప్రవీణ తెలిపారు.కార్యక్రమంలో అడిషనల్‌ కంట్రోలర్‌ అనురాధారెడ్డి, ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ చంద్రకిరణ్‌, ప్రిన్సిపాల్‌ మధుసూదన్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి, ఈశ్వర్‌కుమార్‌, సురేష్‌, గౌతమి తదితరులు పాల్గొన్నారు.

జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా రాజీవ్‌రెడ్డి 
1
1/2

జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా రాజీవ్‌రెడ్డి

జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా రాజీవ్‌రెడ్డి 
2
2/2

జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా రాజీవ్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement