గద్వాలటౌన్: ఆంగ్లేయులపై అలుపెరుగని పోరాటం చేసిన వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి అని.. స్వాతంత్య్ర సంగ్రామంలో ముఖ్య పాత్ర పోషించిన ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ఏబీవీపీ రాష్ట్ర వసతి గృహ కన్వీనర్ ఠాగూర్ రితిసింగ్ సూచించారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో జరిగిన సీ్త్ర శక్తి దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఝాన్సీ లక్ష్మీబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతర ఆమె విద్యార్థులనుద్ధేశించి మాట్లాడారు. సీ్త్రలు అన్నిరంగాల్లో రాణించాలని సూచించారు. మహిళల ఆర్థికాభివృద్ధితోనే దేశం అభివృద్ధి సాధిస్తుందని అభిప్రాయపడ్డారు. ఏబీవీపీ రాష్ట్ర నాయకుడు కరుణాకర్ మాట్లాడుతూ భారత మహిళా శక్తిని, సాధికారకాంక్షను ప్రపంచానికి చాటిన ఽధీరవనిత ఝాన్సీ అని కొనియాడారు. హిందూ సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించుకోవాలని సూచించారు. అనంతరం గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు ఆంజనేయులు, నరేష్, రఘువంశీ, పద్మశ్రీ, సురేష్, నితిన్, సూర్యతేజ, నరేంద్ర, తేజ, మంజునాథ, ఉదయ్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.
వేరుశనగ క్వింటా రూ.7,041
గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్ యార్డుకు బుధవారం 127 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. గరిష్టం రూ.7041, కనిష్టం రూ.4009, సరాసరి రూ.6139 ధరలు లభించాయి. అలాగే, 56 క్వింటాళ్ల ఆముదాలు రాగా గరిష్టం రూ.5939, కనిష్టం రూ.5201, సరాసరి రూ.5839 ధరలు పలికాయి. వీటితోపాటు 2716 క్వింటాళ్ల వరి (సోన) రాగా గరిష్టం రూ.2716, కనిష్టం రూ.1709, సరాసరి ధరలు రూ.2619 వచ్చాయి.
23న ఉమ్మడి జిల్లావాలీబాల్ జట్ల ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: రాజన్న సిరిసిల్లలోఈనెల 29 నుంచి జరగనున్న రాష్ట్రస్థాయి జూనియర్ అంతర్‌జిల్లా వాలీబాల్ టోర్నమెంట్‌లో పాల్గొనే ఉమ్మడి జిల్లా బాలబాలికల జట్ల ఎంపికలను 23వ తేదీన ఉదయం 8.30 గంటలకు జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు హనీఫ్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికల్లో పాల్గొనేవారు కోచ్ పర్వేజ్‌పాష–బాలురు (77805 82604), జిల్లా వాలీబాల్ అసోసియేషన్ కార్యనిర్వాహక కార్యదర్శి చెన్న వీరయ్య–బాలికలు (94403 11067) సంప్రదించాలని సూచించారు.
రిజర్వాయర్ నిర్మాణానికి భూములివ్వం
బల్మూర్: ప్రాణత్యాగాలకై నా వెనకాడం.. తమ భూములను రిజర్వాయర్ నిర్మాణానికి ఇచ్చేదిలేదని నిర్వాసిత రైతులు ఆందోళనకు దిగారు. మండల కేంద్రానికి సమీపంలో నిర్మంచతలపెట్టిన ఉమామహేశ్వర రిజర్వాయర్ నిర్మాణానికి ఇరిగేషన్ అధికారులు బుధవారం భూసేకరణ కార్యక్రమం చేపట్టడంతో విషయం తెలుసుకున్న బల్మూర్, అనంతవరం, అంబగిరి రైతులు నిరసన ర్యాలీ చేపట్టి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. అధికారులు తమకు ఎలాంటి నోటీసులు అందజేయకుండానే కేవలం ఫోన్‌ల ద్వారా కొంతమంది రైతులకు సమాచారం ఇచ్చి భూసేకరణకు పూనుకోవడం సరైందికాదని ప్రశ్నించారు. రిజర్వాయర్ నిర్మాణానికి ఈ ప్రాంతం అనువైనది కాకున్నా.. కేవలం కాట్రాక్టర్లు, పాలకుల కమీషన్ల కకక్కురర్తి కోసమే నిర్మించ తలపెట్టారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతమైన ఇక్కడ రిజర్వాయర్ నిరర్మించాలంటే పీసా చట్టం ప్రకారం అధికారులు నడుచుకోవాల్సి ఉనన్నా.. నిబంధనలు ఉల్లంగించి రైతుల భూములను లాక్కొనే ప్రయతత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఈ రిజర్వాయర్ నిర్మాణ అనుమతులను రద్దు చేయాలని, లేకుంటే తమ పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. భూనిర్వాసిత పోరాట కమిటీ సభ్యులు అనంత సీతారాంరెడ్డి, తిరుపతయ్య, నాగయ్య, కృష్ణయ్య, ఇంద్రసేనారెడ్డి, గణేశ్, రైతులు పాల్గొన్నారు.
వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి


