ఎస్పీ కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలి
గద్వాల: మాదాసి, మాదారి కురువలకు ఎస్సీ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని మాదాసి, మాదారి కురువ ఎస్సీ సంక్షేమ సంఘం నాయకుడు వెంకటేష్ తదితరులు డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం ఆ సంఘం నాయకులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధిలోని అర్హులైన మాదాసి కురువ, మదారి కురువలకు ఎస్సీ కులధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలన్నారు. అదేవిధంగా జాతీయ ఎస్సీ కమీషన్ సిఫారసులు అమలు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 19ప్రకారం, హైకోర్టు ఆదేశాలను ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం వారు కలెక్టరేట్ ఏవోకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బాలరాజు, రాములు, వెంకటేశ్వర్లు, రవిప్రకాష్, బాలకృష్ణ, తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు.
పత్తి మిల్లులో
షార్ట్ సర్క్యూట్
ఉండవెల్లి: మండలంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న పత్తి మిల్లులో సోమవారం షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. దీంతో మిల్లులో సిబ్బంది భయందోళనతో పరుగులు తీశారు. అక్కడే ఉన్న రైతులు, సిబ్బంది.. నీరు, ఇసుకతో మంటలను ఆర్పివేయడంతో భారీ ముప్పు తప్పింది. సమాచారం అందుకున్న ఫైరింజన్ సిబ్బంది అక్కడికి చేరుకొని పూర్తి స్థాయిలో మంటలను అదుపు చేశారు. ఎలాంటి ఆస్తి నష్టం జరగలేదు. సంఘటన స్థలాన్ని ఎస్‌ఐ శేఖర్ పరిశీలించి ప్రమాదం ఎలా జరిగిందని ఆరా తీశారు.
ఎస్పీ కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలి


