ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలి
గద్వాల: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులకు ప్రాధాన్యతినిస్తూ సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఫిర్యాదుల దినోత్సవం సందర్భంగా ఐడీవోసీ కార్యాలయంలో జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పలు సమస్యలపై కలెక్టర్‌కు 106 ఫిర్యాదులు అందించారు. అనంతరం వీటిని ఆయా శాఖలకు చెందిన అధికారులకు పంపి పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. పరిష్కారం కాని యెడల అందుకు సంబంధించి కారణాలు పేర్కొంటూ ఫిర్యాదుదారునికి అక్‌నాలెడ్జ్‌మెంట్ పంపాలని చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.


