సామాజికంగా ఎదగాలి
ఎర్రవల్లి: నాయీ బ్రాహ్మణులు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలని నాయీ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర నాయకులు కిన్నెర శేఖర్, కోట్ల రామకృష్ణ, దొడ్ల రాములు, అగ్రహారం జయన్న అన్నారు. సోమవారం మండలంలోని బీచుపల్లి పుణ్యక్షేత్రంలో ఆ సంఘం నాయకులు నందకుమార్ ఆధ్వర్యంలో కార్తీక వనభోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో నాయీ బ్రాహ్మణులు హాజరై వైద్యనారాయణ ధన్వంతరి స్వామి చిత్ర పటానికి పూలమాలలు వేసి ఆరాధించారు. అనంతరం వారు మాట్లాడుతూ పవిత్రమైన కార్తీక మాసంలో నాయి బ్రాహ్మణులంతా ఒకే చోట కలవడం ఎంతో సంతోషకరమన్నారు. ఇందులో అందరి సామాజిక అంశాలతో పాటు పరిచయాలను తెలుసుకొని పలు రంగాల్లో వారు అభివృద్ధి చెందేలా సంఘం నుండి ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో నాయకులు వెంకటేశ్వర్లు, అశ్విని రమేష్, నాగేష్, అశోక్, శ్రీనివాస్, అశ్విని భాస్కర్, గుమ్మడం వెంకటేశ్వర్లు, బాలస్వామి, తదితరులు ఉన్నారు.


