సహజ సిద్ధంగా.. | - | Sakshi
Sakshi News home page

సహజ సిద్ధంగా..

Nov 17 2025 8:46 AM | Updated on Nov 17 2025 8:46 AM

సహజ స

సహజ సిద్ధంగా..

ఇవీ మిషన్‌ విశేషాలు..

రైతులు ముందుకు రావాలి..

ఆహార అవసరాల డిమాండ్‌ పెరగడంతో అధిక దిగుబడులు పొందేందుకు వ్యవసాయ సేద్యంలో ఉపయోగిస్తున్న ప్రమాదకర ఎరువులు, పురుగు మందులు, రకరకాల సాగు విధానాలు పర్యావరణంతోపాటు మానవ ఆరోగ్యాలకు హాని కలిగిస్తున్నాయి. వ్యవసాయాన్ని సహజ పద్ధతులతో చేయడం వల్ల ఆరోగ్యకర దిగుబడులు లభించడమే కాక పర్యావరణానికి ఎలాంటి హాని జరగదు. దీనిపై రైతులకు అవగాహన లేకపోవడంతో ముందుకు రావడం లేదు. ఈ పథకం దేశం మొత్తంలో యుద్ధప్రాతిపదికన అమలు చేయాల్సిన అవసరం ఉంది. అపోహలు వీడి రైతులు ముందుకు రావాలి.

– వార్ల మల్లేశం, సేవ్‌ నేచర్‌ ప్రతినిధి, కోస్గి

కార్యాచరణ సిద్ధం..

ప్రకృతిలో దొరికే వనరులను వినియోగించడంతోపాటు రసాయనాలు, పురుగు మందుల వాడకం తగ్గించి సహజ పద్ధతిలో వ్యవసాయం చేసేలా రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయం చేసే దిశగా కార్యాచరణ సిద్ధం చేసి అమలు చేస్తున్నాం. ప్రస్తుతం రైతుల గుర్తింపు ప్రక్రియ పూర్తయింది. త్వరలోనే ఎంపిక చేసిన రైతులకు శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించనున్నాం.

– వెంకటేష్‌, జిల్లా వ్యవసాయశాఖ

అధికారి, మహబూబ్‌నగర్‌

జిల్లా క్లస్టర్లు రైతులు

మహబూబ్‌నగర్‌ 20 2,500

నాగర్‌కర్నూల్‌ 15 1,875

నారాయణపేట 10 1,250

జోగుళాంబ గద్వాల 20 2,500

వనపర్తి 10 1,250

మహబూబ్‌నగర్‌ (వ్యవసాయం): అధిక దిగుబడుల కోసం విచ్చలవిడిగా వాడుతున్న రసాయనాలు అటు పర్యావరణానికి.. ఇటు ప్రజల ఆరోగ్యాలకు పెనుముప్పుగా మారుతున్నాయి. ఈ క్రమంలో సంప్రదాయ పద్ధతులతో కూడిన ప్రకృతి వ్యవసాయానికి రైతులను సమాయత్తం చేసేలా కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ మిషన్‌ అండ్‌ నేచురల్‌ ఫార్మింగ్‌ పథకానికి పచ్చజెండా ఊపింది. సేంద్రియ పద్ధతులతో విభిన్న పంటలు పండించడానికి రైతులకు కావాల్సిన ప్రోత్సాహకాలు అందించనుంది. ఆరోగ్యకర దిగుబడులతోపాటు పర్యావరణ హితంగా పంటలు పండిస్తూ.. భూమి, సహజ వనరులను కాపాడుతూ.. రైతులు తక్కువ ఖర్చులతో కూడిన సుస్థిర వ్యవసాయ విధానం వైపు అడుగులు వేసేందుకు ఈ పథకం తోడ్పడనుంది. సంప్రదాయ వ్యవసాయాన్ని సహజ రీతిలో ప్రకృతి వ్యవసాయంగా మార్చాలనే దృక్పథాన్ని పునరుద్ధరించేలా కేంద్ర ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం 60 శాతం వాటా, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం ఖర్చు చేయనున్నాయి. 2025– 26 సంవత్సరంలో 60 వేల ఎకరాల్లో ఈ పథకం కింద సాగు చేపట్టనున్నారు.

సురక్షితమైన పోషకాహారాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో సహజ సాగు పద్ధతులను ప్రోత్సహిస్తుంది. 2025– 26లో ఈ పథకం కోసం వెచ్చించే రూ.2,481 కోట్ల మూలధనంతో కేంద్ర ప్రభుత్వం రూ.1,584 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.897 కోట్లు ఖర్చు చేయనున్నాయి. ఇప్పటికే సాగులో సేంద్రియ పద్ధతులు పాటిస్తున్న రైతులు, పీఏసీఎస్‌లు, ఎఫ్‌పీఓలు, ఎస్‌హెచ్‌జీలు లాంటి వాటికి ఈ పథకంలో ప్రాధాన్యమిస్తారు. సేంద్రియ వ్యవసాయానికి అవసరమయ్యే సహజ ఉత్పత్తులను రైతులకు సులభంగా అందుబాటులో ఉంచేందుకు అవసరాన్ని బట్టి జీవాధార వనరుల కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. కృషి విజ్ఞాన కేంద్రాలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, రైతుల పొలాల్లో 2 వేల వరకు నమూనా సహజ వ్యవసాయ క్షేత్రాలను నెలకొల్పుతారు. ఆసక్తి గల రైతులకు నిపుణులైన శిక్షకులు సహజ వ్యవసాయ పద్ధతులు, జీవ ఎరువుల తయారీ వంటి వాటిలో శిక్షణ ఇస్తారు. జిల్లాలో ఎంపిక చేసిన వ్యవసాయ క్లస్టర్లలో ఈ పథకంపై అవగాహన కల్పించేందుకు, స్థానిక రైతుల మధ్య సహకారం పెంచేందుకు ‘కృషి సఖులు’ సాగు సహాయకులను ఉపయోగించనున్నారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ పరిధిలో ఇలా..

చేకూరే

ప్రయోజనాలు

ప్రకృతి వ్యవసాయానికి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా

మూస ధోరణికి స్వస్తిపలికి.. విభిన్న పంటలకు ప్రోత్సాహం

ప్రతిరైతు సేంద్రియ పద్ధతిని అవలంభించేలా చర్యలు

తద్వారా సురక్షితమైన పోషకాహారం తీసుకొచ్చేందుకు కృషి

ఉమ్మడి జిల్లాలో 9,375 మంది రైతుల ఎంపిక

ప్రతీ మండలంలో..

సహజ వ్యవసాయ పథకం అమలులో భాగంగా ప్రతి మండలంలో ఒక క్లస్టర్‌ గ్రామాన్ని ఎంపిక చేశారు. గుర్తించిన గ్రామం లేదా గ్రామ సముదాయంలో 125 మంది చొప్పున జిల్లాలో 20 క్లస్టర్ల నుంచి మొత్తం 2,500 మంది ఔత్సాహిక రైతులను గుర్తించారు. వారి వ్యవసాయ కమతంలో మొదట ఒక విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతి ఆచరించేలా ప్రోత్సహిస్తారు. మొదటి సంవత్సరం రైతులు శిక్షణలో భాగంగా క్షేత్ర సందర్శన, ఇంటి పెరట్లో అవసరాలకు సరిపడా కూరగాయల సాగుతో ప్రకృతి వ్యవసాయం ప్రారంభిస్తారు. రెండు, మూడేళ్లలో ఆవుపేడ, గోమూత్రం సేకరణ, జీవామృత లాంటి బయో ఉత్పత్తుల తయారీ, మల్చింగ్‌, అంతర పంటల సాగు పద్ధతులు అవలంభించనున్నారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అవగాహన, నమ్మకం ఏర్పడి రైతు తన క్షేత్రంలో కొంత విస్తీర్ణంలో ఆచరణ మొదలుపెట్టాలి. 4–5 ఏళ్లలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులను రైతు తన వ్యవసాయ క్షేత్రంలో ఆచరించాలి. ఇలా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 75 క్లస్టర్లలో 9,375 రైతులను ఎంపిక చేశారు. వీరందరికి శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.

సేంద్రియ ఎరువులు, జీవసంబంధం పద్ధతుల వాడకం వల్ల నేలలో సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి, భూసారం మెరుగుపడుతుంది. రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం తగ్గడం వల్ల వాతావరణంలో కర్బన ఉద్ఘారాలు తగ్గుతాయి. సేంద్రియ ఉత్పత్తులకు మార్కెట్‌లో ఎక్కువ డిమాండ్‌, ధర ఉండటం వల్ల రైతులకు ఆదాయం పెరుగుతుంది. సేంద్రియ ఉత్పత్తులు మానవ ఆరోగ్యానికి సురక్షితమైనవి. పోషక విలువలను అధికంగా కలిగి ఉంటాయి. సహజ వ్యవసాయం పర్యావరణ అనుకూలమైన, స్థిరమైన వ్యవసాయ పద్ధతులపై ఆధారపడి ఉంటుంది. స్థానిక వనరుల వినియోగం ద్వారా గ్రామీణాభివృద్ధి సాధ్యమవుతుంది.

సహజ సిద్ధంగా.. 
1
1/8

సహజ సిద్ధంగా..

సహజ సిద్ధంగా.. 
2
2/8

సహజ సిద్ధంగా..

సహజ సిద్ధంగా.. 
3
3/8

సహజ సిద్ధంగా..

సహజ సిద్ధంగా.. 
4
4/8

సహజ సిద్ధంగా..

సహజ సిద్ధంగా.. 
5
5/8

సహజ సిద్ధంగా..

సహజ సిద్ధంగా.. 
6
6/8

సహజ సిద్ధంగా..

సహజ సిద్ధంగా.. 
7
7/8

సహజ సిద్ధంగా..

సహజ సిద్ధంగా.. 
8
8/8

సహజ సిద్ధంగా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement