మద్యం మత్తులో వాహనాలు నడిపితే చర్యలు | - | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో వాహనాలు నడిపితే చర్యలు

Nov 17 2025 8:46 AM | Updated on Nov 17 2025 8:46 AM

మద్యం

మద్యం మత్తులో వాహనాలు నడిపితే చర్యలు

ఎర్రవల్లి: మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమైతే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం మండలంలోని బీచుపల్లి పదో బెటాలియన్‌లో పోలీస్‌ పెట్రోల్‌ బంక్‌లో ఇటిక్యాల ఎస్‌ఐ రవినాయక్‌ ఆధ్వర్యంలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు, రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించగా ఎస్పీ హాజరై మాట్లాడారు. ప్రయాణికుల భద్రత కోసమే జాతీయ రహదారిపై ఉన్న పెట్రోల్‌ బంకులలో ప్రత్యేక డ్రైవ్‌ను చేపట్టి ప్రయాణికులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందన్నారు. ఇటీవలె జాతీయ రహదారిపై జరిగిన మేజర్‌ రోడ్డు ప్రమాదాలు అన్నీ కూడా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ చేయడం ద్వారానే జరిగాయన్నారు. దీనివల్ల ఎంతో మంది ప్రాణాలను కోల్పోవడంతో వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. పోలీస్‌ వారికి సహకరించి ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ పాటు పడాలని సూచించారు.

వాహనాలను ఎక్కడబడితే అక్కడ నిలపొద్దు

వాహనదారులు జాతీయ రహదారిపై ఎక్కడబడితే అక్కడ వాహణాలను నిలపవద్దని సిఐ రవిబాబు అన్నారు. ముఖ్యంగా మద్యం సేవించి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాహణాలను నడిపి ప్రమాదాలకు కారణం అవ్వరాదన్నారు. హైవేపైకి వచ్చే వారు, హైవే నుండి వెళ్లే వారు, రోడ్డును దాటే వారు తప్పకుండా ఇండికేషన్‌ ఇవ్వాలన్నారు. హైవేపై లాంగ్‌ జర్నీ వెళ్లే వారు నిద్ర వచ్చినా లేదా అలిసిపోయినా తప్పకుండా పెట్రోల్‌ బంకులలో మాత్రమే వాహనాన్ని నిలుపుకోవాలన్నారు. రోడ్డుపై ఎలాంటి ఇండికేషన్‌ లేకుండా వాహనాలను ఇంజన్‌తో సహా నిలపడం వల్ల చాలా ప్రమాదాలు జరగడంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించి తమ ప్రాణాలతో పాటు ఎదుటి వారి ప్రాణాలను కాపాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్‌ సిబ్బంది, తదితరులు ఉన్నారు.

ఇసుక తరలింపునకు అనుమతి ఇవ్వాలని నిరసన

రాజోళి: నదిలో ఇసుక తీసుకునేందుకు ఎడ్ల బండ్లకు అనుమతి ఇవ్వాలని వాటి యజమానులు ఆదివారం రోడ్డెక్కారు. రాజోళిలోని గాంధీ చౌక్‌లో బండ్లను రోడ్లపై నిలిపి నిరసన తెలిపారు. ట్రాక్టర్లు రాత్రి సమయాల్లో ఇసుకను తరలిస్తున్నాయని అయినా వారిపై చర్యలు తీసుకునేవారు లేరని, కాని ఎడ్ల బండ్లపై ఇసుక తీసుకుంటుంటే అడ్డుకుంటున్నారని వాటి యజమానులు అన్నారు. తమకు జీవనోపాధిగా ముందుకు సాగుతుంటే.. ఇలా అడ్డుకోవడం తగదని అన్నారు. అయితే విషయం తెలుసుకున్న ఎస్‌ఐ గోకారి అక్కడకు చేరుకుని ఎడ్ల బండ్లతో ఇందిరమ్మ ఇళ్లకు, లేదా ఇళ్లు కట్టుకునే వారికి ఇసుకను అందిస్తే సమస్య లేదని, నదిలోకి బండ్లతో వెళ్లి, ఆ ఇసుకను ట్రాక్టర్ల వారికి చేర్చడంతో, వారు అధిక ధరలకు అక్రమంగా విక్రయిస్తున్నారని తెలిపారు. వాస్తవంగా ఇళ్లు కట్టుకునే వారికి ఇసుక ఇస్తే ఎవరూ అడ్డుకోరని, అక్రమంగా రవాణా చేస్తుంటే సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. అలాంటి దందాలకు అవకాశమివ్వమని తేల్చి చెప్పారు. ఇళ్లు కట్టుకునే వారి వివరాలు, అనుమతి పత్రాలు తీసుకుని నదిలో ఇసుకను తీసుకోవచ్చని, అక్రమంగా విక్రయించే వారిపై మాత్రం చర్యలు తప్పవని అన్నారు.

క్రీడాకారులను

ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం

వనపర్తి రూరల్‌: విద్యార్థులు క్రీడారంగంలో తమకంటూ ప్రత్యేకతను చాటుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. జిల్లెల చిన్నారెడ్డి కోరారు. ఆదివారం మండలంలోని చిట్యాల ఎంజేపీ బీసీ గురుకుల పాఠశాల క్రీడా మైదానంలో ఉమ్మడి జిల్లా అండర్‌–17 క్రీడల ప్రారంభోత్సవానికి ఆయనతో పాటు ఆర్‌సీఓ శ్రీనివాస్‌గౌడ్‌, డీసీఓ శ్రీవేణి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ముందుగా చిన్నారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఒలింపిక్‌ జ్యోతిని వెలిగించి క్రీడాకారుల వందన సమర్పణను స్వీకరించారు. అనంతరం కబడ్డీ పోటీలను ప్రారంభించి మాట్లాడారు. దేశ నిర్మాణంలో క్రీడాకారులు తమవంతు పాత్ర పోషించాలన్నారు. ప్రతిభగల క్రీడాకారులను తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. క్రీడలు శారీరక దారుఢ్యం, మానసిక ప్రశాంతతను పెంపొందిస్తాయని తెలిపారు. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పిస్తామని చెప్పారు. ప్రిన్సిపాల్‌ ప్రశాంతి మాట్లాడుతూ.. క్రీడా పోటీల్లో ఉమ్మడి జిల్లాలోని 14 ఎంజేపీ బీసీ బాలుర గురుకులాల నుంచి 450 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని తెలిపారు. క్రీడాకారులకు పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పించామని, క్రీడల్లో చరుగ్గా పాల్గొని జయాపజయాలకు భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, పీఈటీలు, క్రీడాకారులు పాల్గొన్నారు.

మద్యం మత్తులో  వాహనాలు నడిపితే చర్యలు  
1
1/1

మద్యం మత్తులో వాహనాలు నడిపితే చర్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement