ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం
గద్వాల: ప్రీమెట్రిక్ ఉపకార వేతనాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ అభివృద్ధి అధికారి సయ్యద్ అక్బర్‌పాషా ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని జెడ్పీహెచ్‌ఎస్, ఎయిడెడ్, మున్సిపల్, ప్రభుత్వ పాఠశాలలో చదివే 9,10వ తరగతి విద్యార్థులు 2025–26 విద్యాసంవత్సరానికి గాను రూ.4వేల చొప్పున ప్రీమెట్రిక్ ఉపకార వేతనాలు పొందేందుకు డిసెంబర్ 15వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు తమ ఆధార్‌కార్డు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రం, గ్రామాల్లోని విద్యార్థుల తల్లిదండ్రులకు రూ.1.50 లక్షలు, పట్టణాల్లోని విద్యార్థులు రూ.2లక్షల వరకు వార్షికాదాయం కలిగి ఉండాలని తెలిపారు. దరఖాస్తులను http:tela nganaepass.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాలని, హార్డ్‌కాపీలు, ఇతర ధ్రువీకరణ పత్రాలను జతపర్చి గద్వాల ఐడీవోసీలోని కార్యాలయంలో అందజేయాలని సూచించారు.
బాల్యాన్ని ఆనందంగా గడపాలి
గద్వాల టౌన్/గట్టు/ధరూరు: బాల్యాన్ని ఆనందంగా గడుపుతూ చక్కగా పాఠశాలకు వెళ్లి చదువుకోవాలని డీఈఓ విజయలక్ష్మీ తెలిపారు. బాలల దినోత్సవం సందర్భంగా శుక్రవారం గట్టు మండలం ఆలూరు ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని, దాన్ని సాధించే దిశగా క్రమ శిక్షణతో అడుగులు ముందుకు వేయాలని కోరారు. నేటి బాలలే రేపటి పౌరులను, ఉత్తమ పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దే బాద్యత ఉపాధ్యాయులపైనే ఉందన్నారు. విద్యార్థులు యోగాతో పాటుగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు.
సాయం అందించే గుణం కలిగి ఉండాలి
మనమెంత ఎదిగినా.. ఎంత దూరంగా ఉన్నా.. సాయమందించే మనస్తత్వాన్ని కలిగి ఉండాలని డీఈఓ విజయలక్ష్మీ అన్నారు. ధరూరులోని సీపీఎస్ పాఠశాలలో కళావేదికను ఆమె ప్రారంభించారు. బూరెడ్డిపల్లికి చెందిన బండ్ల ధర్మారెడ్డి, రామమ్మ జ్ఞాపకార్ధం వారి కుమారుడు కోడలు బండ్ల నాగేశ్వరరెడ్డి, బండ్ల విమలాదేవి విద్యార్థుల అవసరార్ధం రూ.3 లక్షల వ్యయంతో కళా వేదికను నిర్మించారు.
విద్యార్థులను భావి
పౌరులుగా తీర్చిదిద్దాలి
గద్వాలటౌన్: విద్యార్థులను భావి పౌరులుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీఎస్పీ మొగులయ్య పిలుపునిచ్చారు. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక బాలభవన్‌లో బాలల హక్కుల దినోత్సవ వేడుకలను నిర్వహించగా.. ఆయన పాల్గొని మాట్లాడారు. చిన్నారుల రక్షణ కోసం పలు చట్టాలు అమలులో ఉన్నాయని, ఎక్కడైనా ఆపదలో ఉన్న బాలలు కనిపిస్తే తప్పనిసరిగా 1098 లేదా 100 నంబర్‌కి ఫోన్ చేయాలని సూచించారు. జిల్లా సంక్షేమ అధికారిణి సునంద మాట్లాడుతూ బాల్యం ప్రతి చిన్నారి హక్కు అని, వారు స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ఎదగాలని ఆకాక్షించారు. అనంతరం ఆటల పోటీలలో గెలుపొందిన చిన్నారులకు బహుమతులను అందజేశారు.
గ్రంథాలయాలు
ఆధునిక దేవాలయాలు
గద్వాలటౌన్: గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలు అని, వాటిని విద్యార్థులు వినియోగించుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నీలి శ్రీనివాసులు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక జిల్లా గ్రంథాలయంలో చైర్మన్ శ్రీనివాసులు జ్యోతి ప్రజ్వలన చేసి వారోత్సవాలను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పుస్తక పఠనంతోనే విజ్ఞాన సమపార్జన సాధ్యమవుతుందని, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విజ్ఞానాన్ని అందించే పుస్తకాలను అందుబాటులోకి తెస్తామన్నారు. మంచి పుస్తకానికి మించిన మిత్రులు లేరన్నారు. గ్రంథాలయాలు విజ్ఞాన బాండాగారాలని, ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలన్నారు. నేటి యువత గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రంథాల య అభివృద్ధికి దాతల సహకారం తీసుకుంటామని చెప్పారు. అనంతరం విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ అధికారి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం


