అంతా గుట్టుగా!
అధికారుల కళ్లుగప్పి నిషేధిత క్యాట్‌ఫిష్ పెంపకం
ఈ చేపలతో క్యాన్సర్
కోవిడ్ తరువాత ప్రతిఒక్కరికి ఆరోగ్యంపై శ్రద్ధపెరిగింది. ఈక్రమంలో ఆరోగ్యానికి అన్ని రకాలుగా మేలు చేసే జీవనదులు, చెరువులలో పెరిగే సాధారణ చేపలపై మాంసాహారులు ఎక్కువగా మక్కువ చూపెడుతున్నారు. అయితే ప్రజల అవసారాన్ని అలుసుగా తీసుకున్న ఈ క్యాట్‌ఫిష్ పెంపకందారులు అడ్డదారిలో నిషేధిత క్యాట్‌ఫిష్‌ను కూడా విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ప్రధానంగా గద్వాల జిల్లాతో పాటు, పెబ్బేరు, కొత్తకోట, హైదరాబాద్, బెంగుళూరు వంటి ప్రధాన నగరాల్లో క్యాట్‌ఫిష్‌ను విక్రయిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు. దీంతో ఈనిషేధిత క్యాట్‌ఫిష్‌ను తినడం ద్వారా ప్రమాదకరమైన క్యాన్సర్ వ్యాధి వస్తుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈక్రమంలోనే ఈక్యాట్‌ఫిష్‌ను నిషేదించినట్లు స్పష్టం చేస్తున్నారు.
గద్వాల: రెండు నదుల మధ్య వెలసిన నడిగడ్డ ప్రాంతం విషపు చేపల పెంపకానికి నిలయంగా మారింది. కృష్ణా, తుంగభద్ర నదుల తీరప్రాంతాల్లో రెండు దశాబ్దాలుగా నిషేధిత క్యాట్‌ఫిష్ పెంపకం గుట్టుగా కొనసాగుతుంది. ఆంధ్రా ప్రాంతం నుంచి వచ్చిన కొందరు వందల ఎకరాల పంటపొలాలను లీజుకు తీసుకుని దర్జాగా క్యాట్‌ఫిష్ సాగుచేస్తున్నారు. గతంలో క్యాట్‌ఫిష్ చెరువులపై దాడులు జరిగి క్రిమినల్ కేసులు నమోదు కావడంతో అధికారులకు దొరకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రధానంగా ఈ రకమైన నిషేధిత చేపలకు ఆహారంగా చికెన్, కుళ్లిన కోడిగుడ్డు వ్యర్థాలను వినియోగిస్తున్నారు. ఈవ్యర్థాలను ఏటా బహిరంగా వేలం ద్వారా క్యాట్‌ఫిష్ పెంపకందారులు దక్కించుకుంటుడగా, మరోవైపు హైదరాబాద్ నుంచి సైతం వ్యర్థాలు తరలిస్తున్నారు. ఇంతటి ప్రమాదకర చేపలు పెంపకంపై నిఘాపెట్టి చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మాత్రం అటువైపు దృష్టిసారించడం లేదు.
క్యాట్‌ఫిష్ పెంపకంలో రూ.లక్షల్లో లాభాలు గడిస్తుండడంతో క్యాట్‌ఫిష్ పెంపకందారులు చికెన్ వ్యర్థాలను దక్కించుకునేందుకు పెద్ద ఎత్తున పోటీపడుతుండడం విశేషం. పూర్తి నిరుపయోగమైన చికెన్ వ్యర్థాలు రూ.లక్షల్లో ధర పలుకుతున్నాయంటే ఆశ్చర్యం కలుగక మానదు. జిల్లాలో సుమారు 200లకు పైగా చికెన్‌షాపులు ఉండగా కస్టమర్లు చికెన్ తీసుకునే క్రమంలో స్కిన్, కాళ్లు, తల, పేగులు వంటి వ్యర్థాలు వేలంపాటలో ఏటా రూ.80 లక్షల ధర పలుకుతుందంటే క్యాట్‌ఫిష్ సాగు ఏ స్థాయిలో జరుగుతుందో స్పష్టమవుతుంది. ఇది సరిపోదు అన్నట్టు ఏకంగా షాద్‌నగర్, హైదరాబాద్ ప్రాంతాల నుంచి సైతం చికెన్‌వ్యర్థాలు, కుళ్లిన కోడిగుడ్లు జిల్లాకు పెద్ద ఎత్తున తరలిస్తున్నారు.
చికెన్ వ్యర్థాలకు డిమాండ్
కేసులు పెడతాం
నిషేధిత క్యాట్‌ఫిష్‌ను ఎవరైన సాగుచేస్తే వా రిపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం. చెరువులను ధ్వంసం చేయడమే కాకుండా వాటి పెంపకందారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం.
– వి.లక్ష్మీనారాయణ, అదనపు కలెక్టర్
చికెన్, కుళ్లిన కోడిగుడ్ల వ్యర్థాలే ఆహారంగా అందిస్తున్న వైనం
జిల్లా నుంచే కాకుండా హైదరాబాద్ నుంచి కోళ్ల వ్యర్థాలు
ఫంగస్ చేపల చెరువులఽమధ్యలో క్యాట్‌ఫిష్ చెరువులు
వీటిని తింటే రోగాలుఖాయమంటున్న వైద్య నిపుణులు
అంతా గుట్టుగా!


