విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
ధరూరు: వసతిగృహంలోని విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ అక్బర్ అన్నారు. గురువారం రాత్రి ఆయన మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతిగృహాన్ని ఆయన తనిఖీ చేశారు. విద్యార్థుల కోసం వండిన భోజనాన్ని, స్టాక్ రికార్డులు, హాస్టల్ పరిసరాలు, స్టోర్ రూంలోని కిరాణ సరుకులు, వాటి ఎక్స్‌పైరీ తేదీలను పరిశీలించారు. పాత్రలను శుభ్రంగా కడిగిన తర్వాత, శుభ్రమైన ప్రదేశంలో వంట చేయాలని వంట వారికి సూచించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు ఏమైనా ఉంటే తెలియజేయాలని సూచించారు. అలాగే, ప్రతి విద్యార్థి వ్యక్తిగత శుభ్రత పాటించాలని, సమయాన్ని వృథా చేసుకోకుండా శ్రద్ధగా చదవాలని సూచించారు. వార్డెన్ నర్సింహులు, హాస్టల్ సిబ్బంది పాల్గొన్నారు.


