అలవి వల పట్టివేత
అలంపూర్ రూరల్: మండలంలోని గొందిమల్ల గ్రామ శివారులో కృష్ణానది పరివాహక ప్రాంతంలో నిషేధిత అలవి వలను గురువారం పట్టుకున్నట్లు ఎస్‌ఐ వెంకటస్వామి తెలిపారు. వివరాలిలా.. కాకినాడ జిల్లాకు చెందిన బాబురావు, జంగంపాడ్ గ్రామానికి చెందిన శంకర్ ఆదేశాల మేరకు నిషేధించిన అలవి వలలతో కృష్ణానదిలో చేపలు పట్టి తీసుకువెళ్తుండగా.. పోలీసులు పట్టుకున్నారు. జిల్లా మత్య్సశాఖ అధికారి షకీలాభానుకు సమాచారం ఇవ్వగా.. ఆమె దానిని పరిశీలించి అలవి వలగా గుర్తించింది. ఈమేరకు సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.


