జాతీయస్థాయి సంగీత వాయిద్య పోటీలకు ఎంపిక
గద్వాలటౌన్: ప్రభుత్వ బాలురు ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న సుందర్‌రాజు జాతీయ స్థాయిలో జరిగే సంగీత వాయిద్య పోటీలకు ఎంపికయ్యాడు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి కళా ఉత్సవ్ పోటీలలో సుందర్ రాజు పాల్గొని సత్తాచాటారు. రాష్ట్రస్థాయి సంగీత వాయిద్య పోటీల విభాగంలో అత్యంత ప్రతిభ కనబర్చి మొదటిస్థానంలో నిలిచారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న సుందర్‌రాజును గురువారం పాఠశాలలో ఘనంగా సన్మానించారు. పాఠశాల హెచ్‌ఎం రేణుకాదేవి, గైడ్ టీచర్ దీప్తి, ఫిజకల్ డైరెక్టర్ హైమావతి అభినందించారు. జాతీయ స్థాయి పోటీలలో సత్తాచాటాలని హెచ్‌ఎం పిలుపునిచ్చారు.
బస్సు యాత్రను
జయప్రదం చేయాలి
గద్వాల: సీపీఐ పార్టీ వందేళ్ల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బస్సు జాతాను నిర్వహించనున్నట్లు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు అన్నారు. గురువారం ఆయన పార్టీకార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈనెల 15వ తేదీన నిర్వహించే సీపీఐ రాష్ట్ర బస్సు జాతను జయప్రదం చేయాలని, కార్యక్రమానికి జాతీయకార్యదర్శి మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, కార్యవర్గ సభ్యులు ఎం బాలనర్సింహులు హాజరు కానున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో రంగన్న, ఆశన్న, ప్రవీణ్, పరమేష్‌లు పాల్గొన్నారు.
ఏసీబీ వలలో
టౌన్ ప్లానింగ్ ఆఫీసర్
అయిజ: రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల మున్సిపల్ ఇన్‌చార్జ్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వరప్రసాద్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. అయితే, అయిజ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అయిన వరప్రసాద్.. ఆదిబట్ల మున్సిపాలిటీలో ఇంచార్జ్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ఈక్రమంలో ఆదిబట్ల మున్సిపాలిటీలో ఓ ఇంటి నిర్మాణం కోసం ఒక వ్యక్తి నుంచి రూ.1.50 లక్షలు డిమాండ్ చేశారు. అయితే, బాధితుడు గురువారం రూ.75 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వరప్రసాద్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి వంశీని పట్టుకొని కేసు నమోదు చేసినట్లు తెలిసింది. ఈ విషయానికి సంబంధించి పలు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. అయిజ మున్సిపాలిటీలో కలకలం రేపాయి.
జాతీయస్థాయి సంగీత వాయిద్య పోటీలకు ఎంపిక


