ఆకట్టుకున్న గ్రామ సింహాల పరుగుపందెం
గట్టులో అంబాభవాని జాతర సందర్భంగా గురువారం గ్రామ సింహాల పరుగు పందెం పోటీలను నిర్వహించారు. కర్ణాటక, తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి 18 గ్రామ సింహాలు రేసులో పాల్గొన్నాయి. పోటీలను పీఏసీఎస్ చైర్మన్ వెంకటేష్, రామకృష్ణారెడ్డిలు ప్రారంభించారు. కుచినేర్ల వీరేస్‌కు చెందిన గ్రామసింహం గెలిచి రూ.10వేలు దక్కించుకోగా.. ఉప్పలపాడు యల్లప్పకు
చెందిన కుక్క రెండోస్థానంలో, రాజపురం రాజేందర్‌కు చెందిన కుక్క
మూడోస్థానంలో నిలిచాయి. కుక్కల పరుగు పందెం తిలకించేందుకు
చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తరలివచ్చారు. – గట్టు


