వీధి కుక్కల బెడద తీరేనా..? | - | Sakshi
Sakshi News home page

వీధి కుక్కల బెడద తీరేనా..?

Nov 13 2025 8:28 AM | Updated on Nov 13 2025 8:28 AM

వీధి

వీధి కుక్కల బెడద తీరేనా..?

సుప్రీంకోర్టు ఆదేశాలపై ప్రజల ఆశాభావం

సిబ్బందిని ఆదేశించాం

గద్వాలటౌన్‌: జిల్లాలోని మున్సిపల్‌ పట్టణాలు, గ్రామాలలో కుక్కల స్వైర విహారం ఎక్కువైంది. వీధుల్లోనే కాదు.. ప్రధాన రోడ్లపై కూడా జనాన్ని వెంటాడుతున్నాయి. రాత్రి, పగలు తేడా లేకుండా గుంపులు గుంపులుగా సంచరిస్తున్నాయి. దీంతో బయటకు వెళ్లాలంటనే స్థానికులు జంకుతున్నారు. నిత్యం ఏదో ఓచోట వాటి బారిన పడి ఆసుపత్రి పాలవుతున్నారు. వీధికుక్కల సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు మాత్రం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం కుక్కల సమస్యపై తీర్పును పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం ఆదేశాలనైనా జిల్లా అధికారులు పాటిస్తారా లేదా.. అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గద్వాల పట్టణంలో గడిచిన రెండు నెలల్లోనే సుమారు వంద మంది వరకు కుక్కకాటు బారినపడి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స పొందారంటే పరిస్థితి త్రీవతను అర్థం చేసుకోవచ్చు. ఇంకా చాలా మంది కుక్కకాటు బాధితులు ఉన్నప్పటికి ఆ సంఘటనలు వెలుగులోకి రావడం లేదు.

రూ.30 లక్షలతో ఏబీసీ కేంద్రం

జిల్లా కేంద్రంలో వీధి కుక్కల సంతతిని అరికట్టేందుకు రూ.30 లక్షల వ్యయంతో జంతు జనన నియంత్రణ కేంద్రాన్ని (ఏబీసీసీ) నిర్మించారు. ఇక్కడ శస్త్ర చికిత్సల కోసం ప్రత్యేక గదిని ఏర్పాటు చేశారు. దీన్ని టెండర్‌ ప్రాతిపదికన ఓ ఎన్‌జీవో సంస్థకు కాంట్రాక్టు కట్టబెట్టారు. వారు పశు వైద్యులను నియమించడంతో పాటు, కుక్కుల పట్టే వారిని కూడా నియమించుకోవాల్సి ఉంటుంది. కాంట్రాక్టు ఒప్పదంలో బాగంగా పశువైద్యులు కుక్కలకు శస్త్ర చికిత్స చేయడం, ఆ తరువాత వాటికి కొన్ని రోజుల పాటు అక్కడే ఏర్పాటు చేసిన కేజ్‌లో ఉంచి సంరక్షించాలి. వాటికి ఆహారం, తాగునీరు అందించడంతో పాటు రేబిస్‌ టీకాలను సైతం వేయాల్సి ఉంది. కోలుకున్న తరువాత వాటిని మళ్లీ యధాస్థానంలో వదిలేయాలి. ఇలా చేయడానికి ఒక్కోదానికి రూ.1550 మున్సిపాలిటీ చెల్లించింది. ఇప్పటి వరకు సుమారు 800 కుక్కలను పట్టుకుని సంతానోత్పత్తి కలగకుండా చర్యలు చేపట్టారు. అయితే గత ఎనిమిది నెలలుగా ఎన్‌జీవో సంస్థ పనిచేయడం లేదు. దీంతో కుక్కల సంతానోత్పత్తి నిలిచిపోయింది. ఏబీసీ కేంద్రాన్ని ఏర్పాటు చేయకుమందు మున్సిపల్‌ కౌన్సిల్‌ చొరవ తీసుకుని రాజమండ్రి నుంచి ప్రత్యేకంగా సిబ్బందిని పిలిపించి కుక్కలను పట్టించారు. అలా పట్టకున్న కుక్కలను ప్రత్యేక వాహనాలలో అటవీ ప్రాంతాలకు తరలించారు. మిగిలిన మున్సిపాలిటీలలో ఏబీసీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది.

హోటళ్లు, మాంసం దుకాణాలే అడ్డా..

ఏటా కుక్కలు ప్రజలపై దాడి చేసి గాయపర్చడం సాధారణంగా మారింది. వాటి నియంత్రణకు మున్సిపల్‌ యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అయితే కుక్కల సంతతి నానాటికీ వృద్ధి చెందడానికి కారణం ఆయా పట్టణాల్లోని వాతావరణమే. హోటళ్లు, ఫంక్షన్‌ హాల్స్‌, ఫాస్టుఫుడ్‌ కేంద్రాలు, మాంసం, చికెన్‌ దుకాణాలు.. వాటి ఆహార లభ్యతకు చిరునామాగా ఉంటున్నాయి. అక్కడే తిష్టవేసి ఆశ్రయం పొందుతున్నాయి. ఈ క్రమంలోనే గుంపులు గుంపులుగా స్వైర విహారం చేసి స్థానికులను గాయపర్చుతున్నాయి. రాత్రి వేళ విధులు ముగించుకొని వచ్చేవారితో పాటు, ముఖ్యంగా వేకువ జామున వాకింగ్‌కు వెళ్లే వారు, రాత్రి వేళ అత్యవసర నిమిత్తం ఆసుపత్రి, రైల్వే స్టేషన్‌, బస్టాండ్‌కు వేళ్లే వారికి కుక్కలు ఇబ్బందుల్ని కలిగిస్తున్నాయి. ఇళ్ల ముందు ఆడుకుంటున్న చిన్నారులపై దాడి చేసి గాయపరుస్తున్నాయి.

‘విద్యాసంస్థలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, క్రీడా మైదానాలు, ఆసుపత్రులు తదితర జన రద్దీ ఉండే

బహిరంగ ప్రదేశాలలో వీధి కుక్కలను సంచరించకుండా తగు ఏర్పాట్లు చేయాలి. వాటిని ప్రత్యేక షెడ్లకు తరలించండి.’ – కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలకు ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవి.

తరచూ పాదచారులు, చిన్నారులపై దాడులు

నెల రోజుల్లో 100కి పైగా కుక్క కాటు కేసులు

ఏటీసీ కేంద్రం ఉన్నా..

సిబ్బంది లేక ఇబ్బంది

కుక్కలతో ప్రజలకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఆ దిశగా ఇప్పటికే సిబ్బందిని ఆదేశించాం. కుక్కల బెడదపై వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం. తాజాగా కుక్కల తరలింపుపై ఉన్నతాధికారుల నుంచి ఇంకా ఆదేశాలు రాలేదు. ఏబీసీ కేంద్రాన్ని పునరుద్దరించడానికి ఎన్‌జీఓ సంస్థలతో చర్చిస్తున్నాం.

– జానకిరామ్‌, కమిషనర్‌, గద్వాల

వీధి కుక్కల బెడద తీరేనా..? 1
1/2

వీధి కుక్కల బెడద తీరేనా..?

వీధి కుక్కల బెడద తీరేనా..? 2
2/2

వీధి కుక్కల బెడద తీరేనా..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement