లక్ష్యం.. వందశాతం
పన్ను వసూళ్లపై పంచాయతీల దృష్టి
–8లో u
2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను వసూళ్లను నవంబర్ 1 నుంచి ప్రారంభించాం. ఇప్పటికి 10శాతం పన్నులు వసూలయ్యాయి. వందశాతం పన్నులు వసూలు అయ్యేలా అవసరమైన కార్యాచరణను సిబ్బందికి తెలియజేశాము. గడిచిన నాలుగేళ్ల నుంచి తీసుకుంటున్న ప్రత్యేక చర్యల వల్ల డిమాండ్ పెరుగుతోంది.
– నాగేంద్రం, జిల్లా పంచాయతీ అధికారి
జిల్లాలో పన్ను వసూళ్ల లక్ష్యం వివరాలిలా..
గద్వాలన్యూటౌన్: గ్రామ పంచాయతీలకు ప్రధాన ఆదాయ వనరు అయిన పన్నులపై అధికారులు దృష్టి సారించారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్ను వసూళ్లను ప్రారంభించారు. ఈ ఏడాది జిల్లాలో రూ.4.03 కోట్లు లక్ష్యంగా ఉంది. శతశాతం వసూలు అయ్యేలా సిబ్బందికి అధికారుల దిశా నిర్ధేశం చేశారు.
పన్నులే ప్రధాన ఆదాయ వనరు
గ్రామ పంచాయతీలు స్వయం పోషకాలుగా ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తుంటాయి. పంచాయతీలకు ఇంటిపన్ను, తాగునీటిపన్నుతో పాటు వాణిజ్య దుకాణాలు, ఫ్యాక్టరీల నుంచి లైసెన్స్ ఫీజు వసూలు చేస్తాయి. పంచాయతీలు ఈ పన్నులే ప్రధాన ఆదాయవనరు. పలు అవసరాలకు పంచాయతీలకు పన్నుల రూపేణ వచ్చే సొమ్మే దిక్కు అవుతుంది. అయితే ప్రభుత్వం పరంగా ఎస్‌ఎఫ్‌సీ, ఆర్థికసంఘం నుంచి నిధులు మంజూరు అవుతాయి. ఇది కూడా జనాభా ప్రాతిపదికన రూ.2లక్షల లోపు మాత్రమే ఆయా పంచాయతీలకు వస్తోంది. అయితే పంచాయతీల్లో పాలకవర్గాలు లేనందున ఎస్‌ఎఫ్‌సీ, ఆర్థిక సంఘం నుంచి రెండేళ్లుగా నిధులు రావడం లేదు. కేంద్రం కూడా వందశాతం పన్ను వసూళ్లయితేనే ప్రత్యేకంగా గ్రాంట్లు ఇస్తామని చెప్పింది. ఇలాంటి పరిస్థితి వల్ల పంచాయతీలు పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన పరిస్థితి.
పెరుగుతున్న డిమాండ్
2022–23 నుంచి జిల్లా వ్యాప్తంగా అన్ని మండల్లాలోని పంచాయతీల్లో యేటా పన్నుల డిమాండ్ పెరుగుతోంది. దీనికి కారణాలు ఏమిటంటే పలు గ్రామాల్లో మట్టి మిద్దెల స్థానంలో ఆర్‌సీసీ ఇళ్ళు నిర్మించుకున్నారు. వీటికి రీఅసెస్‌మెంట్ చేసి, పన్ను పెంచుతున్నారు. మండల కేంద్రాల్లో అసెస్‌మెంట్ లేని దుకాణాలను గుర్తించి, అసెస్‌మెంట్ చేసి పన్ను విధించారు. ప్రధానంగా ఎర్రవల్లి చౌరస్తా, అలంపూర్‌చౌరస్తా, ధరూర్ గట్టు తదితర మండల కేంద్రాల్లో పలు దుకాణాలకు కొత్తగా అసెస్‌మెంట్ చేసి, లైసెన్స్ ఫీజు విధించారు. దీంతో డిమాండ్ పెరుగుతూ వస్తోంది. కాగా ప్రతి ఆర్థిక సంవత్సరంలో పన్ను ఐదు శాతం పెంచుతారు. ఈక్రమంలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గడిచిన ఏడాది బకాయిలు రూ. 22.42లక్షలు, ఈఏడాది రూ. 3.80 కోట్లు మొత్తంగా రూ. 4.03కోట్లు పన్ను లక్ష్యంగా ఉంది.
రూ.4.03 కోట్లు వసూలు చేయాలని సిబ్బందికి దిశానిర్దేశం
ఇప్పటికీ 10 శాతం పూర్తి చేసిన కార్యదర్శులు
రెండేళ్లుగా ఎస్‌ఎఫ్‌సీ,
ఆర్థిక సంఘం నిధులు విడుదల కాక కొరవడిన ప్రగతి
మండలం లక్ష్యం
(రూ.లక్షల్లో)
గట్టు 51.14
గద్వాల 46.31
ఉండవల్లి 45.38
మల్దకల్ 39.74
అయిజ 37.18
ఎర్రవల్లి 36.86
ధరూర్ 30.16
కేటీదొడ్డి 24.36
మానవపాడు 24.33
రాజోళి 22.64
అలంపూర్ 15.89
ఇటిక్యాల 14.92
వడ్డేపల్లి 14.36
లక్ష్యం.. వందశాతం


