ఆయిల్‌పాం సాగుతో దీర్ఘకాల లాభాలు
రాజోళి: రైతులు ఆయిల్‌పాం తోటలను పెంచడం వల్ల ప్రభుత్వం ద్వారా అందే సబ్సిడీ పొందడమే కాకుండా, ఆర్థికంగా లాభపడతారని జిల్లా వ్యవసాయ సహకార అధికారి జి.శ్రీనివాస్ అఽన్నారు. ఉద్యానవన శాఖ అధికారులతో కలిసి ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో మండలంలోని మాన్‌దొడ్డిలో ఆయిల్‌పాం సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాంప్రదాయ పంటలకు స్వస్తి పలికి ఆయిల్‌పాం తోటలను సాగు పెంచడం ద్వారా ఒకసారి పెట్టుబడి పెడితే దీర్ఘకాలం ఆదాయం సమకూరుతుందన్నారు. కొద్దిపాటి పెట్టుబడితో లాభాలు ఆర్జించే ఆయిల్‌పాం సాగును ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాయని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, ఉద్యానవన అధికారులు రాజశేఖర్, మహేష్, యశ్వంత్, త్రిక్రమ్, అశోక్‌వర్ధన్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.


