25 ఎకరాల్లో సాగు చేశా..
నేను దాదాపు 25 ఎకరాల్లో పత్తి పంట సాగు చేశా. పత్తి తీసేందుకు కూలీల కొరత ఉండటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నందికొట్కూర్ ప్రాంతం నుంచి తీసుకొస్తున్నా. కేజీ పత్తి తీసేందుకు రూ.16 చెల్లించడంతో పాటు ఆటో చార్జి ఒక్కొక్కరికి రూ.120 నుంచి రూ. 150 వరకు ఇవ్వాల్సి వస్తోంది. అకాల వర్షాలతో పత్తితీత కష్టమైంది. ఈ ఏడాది పెట్టుబడి అమాంతం పెరిగిపోయింది.
– భీమ రాజు, రైతు, గోకులపాడు
ఇతర ప్రాంతాల నుంచి..
అధిక వర్షాలతో పత్తి ఒకేసారి తీయాల్సి రావడంతో కూలీల కొరత ఏర్పడింది. దీంతో ఇతర ప్రాంతాల నుంచి అధిక కూలి చెల్లించి కూలీలను తీసుకు రావాల్సి వస్తోంది. దీనికి రవాణా ఖర్చులు అదనం. వర్షాల కారణంగా పత్తి తడిసిందని కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర పలకడం లేదు. ఆదాయం పెట్టుబడి, కూలీలకే సరిపోయేలా లేదు. ప్రభుత్వం స్పందించి కొనుగోలు కేంద్రాల వద్ద కొర్రీలు పెట్టకుండా చూసుకోవాలి.
– సంజీవనాయుడు, పైపాడు, వడ్డేపల్లి మండలం
●
25 ఎకరాల్లో సాగు చేశా..


