విద్యాభివృద్ధికి ఆద్యుడు మౌలానా అబుల్ కలాం
గద్వాల: మౌలనా అబుల్ కలాం ఆజాద్ విద్యాభివృద్ధికి ఎన్నో సంస్కరణలు చేసిన మహోన్నత వ్యక్తి అని కలెక్టర్ సంతోష్ అన్నారు. అబుల్ కలాం జయంతిని పురస్కరించుకొని మంగళవారం జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ఐడీఓసీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి కలెక్టర్ సంతోష్, ఎమ్మెల్యే బండ్ల కృషమోహన్‌రెడ్డితో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యాభివృద్ధికి ఆయన చేసిన సేవలు కొనియాడారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, నర్సింగరావు, కార్యాలయ అధికారులు తదితరులు ఉన్నారు.


