రాష్ట్రస్థాయి యోగాసన పోటీల్లో ప్రతిభ చాటాలి
మహబూబ్‌నగర్ క్రీడలు: రాష్ట్రస్థాయి యోగాసన పోటీల్లో క్రీడాకారులు ప్రతిభచాటాలని ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి కురుమూర్తిగౌడ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా నార్సింగ్‌లోని ఎస్‌ఎంపీ స్కూల్‌లో శనివారం నుంచి ప్రారంభమైన రాష్ట్రస్థాయి సబ్ జూనియర్, జూనియర్ యోగాసన పోటీలకు ఉమ్మడి జిల్లా క్రీడాకారులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా స్థానిక మెయిన్ స్టేడియంలో క్రీడాకారులను కురుమూర్తిగౌడ్ అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా యోగాసన క్రీడా సంఘం కార్యదర్శి ఆర్.బాల్‌రాజు, భారత్ వికాస్ పరిషత్ ప్రతినిధి జి.పాండురంగం, యోగ సంఘం సభ్యులు సూర్యప్రకాశ్, కిషన్‌దాస్, వెంకటేశ్, బాలమణి పాల్గొన్నారు.
● 8–10 ఏళ్ల విభాగంలో అరుణ్, అరవింద్‌సాయి, యుగంధర్, సంజయ్, ప్రశాంత్ ఆర్య, వైష్ణవి, శ్రీరాఘవి, అర్చన, ప్రియ, అద్వేత, 10–12 విభాగంలో సంపత్‌కుమార్, శ్రీప్రసాద్, గౌతమ్, హరికృష్ణ, ఉదయ్‌కుమార్, దీపిక, క్రిష్ణవేణి, మనస్విని, మోక్షిత, రూప, 12–14 విభాగంలో చరణ్, రంజిత్‌కుమార్, విఘ్నేష్, సృజన్ కుమార్, జయచంద్ర, ధనలక్ష్మి, స్వప్న, నవిత, నయనశ్రీ, వైష్ణవి, 14–16 విభాగంలో శివతేజ, బాలు, సుశీల్‌కుమార్, సాగర్, కార్తీక్, జె.వైష్ణవి, నందిని, ప్రవళిక, రూపలత, దీపిక, 16–18 విభాగంలో తిరుపతి, చైతన్య, వంశీ ఎంపికయ్యారు.


