
ఉత్సాహంగా ఎంపిక పోటీలు
గద్వాలటౌన్: రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల కోసం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఎంపిక పోటీలు ఉత్సాహంగా సాగాయి. శనివారం స్థానిక మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో అండర్ –14, 16, 18, 20 విభాగాలలో బాలురు, బాలికలకు వేర్వేరుగా జిల్లాస్థాయి ఎంపిక పోటీలు నిర్వహించారు. 100 మీటర్లు, 600 మీటర్లు, 800 మీటర్లు,1500 మీటర్లు, 3000 మీటర్లు పరుగు పందెంతో పాటు లాంగ్‌జంప్, హైజంప్, షాట్‌ఫుట్, డిస్క్‌త్రో, జావలిన్ త్రో విభాగాలలో క్రీడాకారులు పోటీపడ్డారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 750 మంది విద్యార్థులు పోటీలలో పాల్గొన్నారు. జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలను డీవైఎస్‌ఓ జితేందర్, ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు జెండా ఊపి పోటీలను ప్రారంభించి మాట్లాడారు. పట్టుదల, శ్రద్ధ అనేది క్రీడల వల్ల అలవడతాయని, జిల్లాస్థాయిలో ప్రతిభ చాటిన 30 మంది క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఎంపికై న వారందరూ ఈ నెల 30, 31వ తేదీలలో పాలమూరు యూనివర్సిటీ సేడియంలో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీలలో పాల్గొంటారని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు బీసన్న, సతీష్‌కుమార్ తెలిపారు. నగేష్‌బాబు, వెంకట్రాములు, బషీర్, జగదీష్, నర్సింహరాజు, మోహనమురళీ, ఆనంద్, రఘు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.