
సురవరానికి ఘన నివాళి..
గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శనివారం మాజీ సర్పంచ్ శేషన్‌గౌడ్, గ్రామస్తులు సూరిగౌడు, లక్ష్మన్న, రాంరెడ్డి, మణికుమార్, సుధాకర్‌రెడ్డి, ఎంఈఓ రామకృష్ణ, ప్రధానోపాధ్యాయురాలు శ్యామల, ఉపాధ్యాయులు గరీబ్, గజరాజు విద్యార్థులతో కలిసి సురవరం సుధాకర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన ఆత్మకూ శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. అదేవిధంగా సురవరం వెంకట్రామిరెడ్డి విజ్ఞాన కేంద్రం వద్ద ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించగా నాయకులు వీరాంజనేయులు, బాబు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మరణం స్థానికంగానేగాక ఎమ్మెల్యేగా పోటీచేసిన కొల్లాపూర్‌లోనూ తీవ్ర విషాదం నింపింది.
పాఠశాలలో నివాళులర్పిస్తున్న
ఉపాధ్యాయులు, విద్యార్థులు