
చెత్త నిర్వహణ అస్తవ్యస్తం
● అలంపూర్ చౌరస్తా,సర్వీస్‌రోడ్లు దుర్గంధమయం
● భారీ చెట్లతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు
అలంపూర్: నిత్యం వేలాది వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే అలంపూర్ చౌరస్తా, సర్వీస్‌రోడ్లలో చెత్త నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఆయా శాఖల మధ్య సమన్వయ లోపం కాస్తా వాహనదారులు, ప్రజలను ఇబ్బందుల్లో పడేస్తుంది. అలంపూర్ చౌరస్తాలోని నాలుగు రోడ్ల కూడలి, సర్వీస్ రోడ్ల పక్కనే చెత్తను వేస్తుండటంతో పందులకు అవాసాలుగా మారాయి. ఫ్‌లైఓవర్ పక్కన ముళ్ల పొదలు, పచ్చదనం కోసం వేసిన చెట్ల కొమ్మలు ఏపుగా పెరిగి రోడ్లను కమ్మేస్తున్నా.. వాహనదారులకు ఇబ్బందులు కలుగుతున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. మరికొన్ని చోట్ల చెట్లు ఏపుగా పెరిగి విద్యుత్ తీగలను తాకుతున్నాయి. ఫ్లైఓవర్ కూడలి, సర్వీస్ రోడ్ల నిర్వహణను నేషనల్ అథారిటీ సిబ్బంది.. మిగిలిన ప్రాంతాలు పంచాయతీ సిబ్బంది చేపడుతున్నారు. అయితే, నాలుగు రోడ్ల కూడలిలోని ఫ్‌లైఓవర్ పక్కన విశాలమైన మైదానం ఉంటుంది. గతంలో నేషనల్ ఆథారిటీ అధికారులు పచ్చదనం పెంపొందించడానికి మొక్కలను నాటారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. దీంతో ఆ ప్రాంతం అపరిశుభ్రంగా మారి పందులకు అవాసంగా మారింది. ఈ మార్గంలో రాకపోకలు సాగించే వారు, ప్రయాణికులు ఆ ప్రాంతంలో ఒంటికి, రెంటికీ వినియోగిస్తుండడంతో దుర్వాసన వెదజల్లుతోంది. అధికారులు ఇప్పటికై న నాలుగు రోడ్ల కూడలిపై దృష్టి సారించాలని, చెత్త నిర్వహణ విధిగా చేపట్టేలా చూడాలని, సర్వీస్ రోడ్లపై వాహనదారులకు ఇబ్బందిగా మారిన చెట్ల కొమ్మలు కత్తిరించాలని స్థానికులు కోరుతున్నారు.

చెత్త నిర్వహణ అస్తవ్యస్తం

చెత్త నిర్వహణ అస్తవ్యస్తం