బిగుస్తున్న ఉచ్చు.. | - | Sakshi
Sakshi News home page

బిగుస్తున్న ఉచ్చు..

Aug 22 2025 3:21 AM | Updated on Aug 22 2025 3:21 AM

బిగుస

బిగుస్తున్న ఉచ్చు..

నందిన్నె రైస్‌మిల్లులో విజిలెన్స్‌ సోదాలు

రెండు రోజులపాటు

విజిలెన్స్‌ సోదాలు..

నందిన్నె రైస్‌మిల్లుకు 2022 రబీలో (1425.520 మెట్రిక్‌ టన్నుల ధాన్యం), 2024 ఖరీఫ్‌లో (5948.560 మె.ట) 2024–25 రబీలో (10,294.680 మె.ట) సీజన్‌లలో సదరు రైస్‌మిల్లుకు సుమారు రూ.45 కోట్ల విలువ గల (40కేజీల సామర్థ్యం ఉన్న 4 లక్షల ధాన్యం బస్తాలు) సివిల్‌సప్లై శాఖ అధికారులు కేటాయించారు. ఇందులో ఇప్పటి వరకు 2024 ఖరీఫ్‌, రబీకి సంబంధించి కేవలం రూ.10 కోట్ల విలువ గల సీఎమ్మార్‌ బియ్యం మాత్రమే అందించారు. 2022 రబీకి నిర్వహించిన టెండర్‌ సరుకు ఇంకా అందించలేదు. ఇలా మొత్తంగా కలుపుకొని ప్రభుత్వానికి ఇంకా రూ.40కోట్ల విలువ గల బియ్యాన్ని ప్రభుత్వానికి అందించాల్సి ఉంది. ఇదిలాఉండగా, సదరు రైస్‌మిల్లులో ఈనెల 11, 12వ తేదీలలో విజిలెన్స్‌ అధికారులు సోదాలు నిర్వహించారు. ప్రభుత్వం వద్ద తీసుకున్న ధాన్యం లెక్కలతో రైస్‌మిల్లులో ఉన్న ధాన్యం లెక్కలు సరిచూశారు. రెండు రోజుల పాటు సాగిన సోదాల వివరాలను సదరు విజిలెన్స్‌ అధికారులు వెల్లడించలేదు. ప్రభుత్వం వద్ద తీసుకున్న ధాన్యం బస్తాల లెక్కకు మిల్లులో ఉన్న ధాన్యం బస్తాల లెక్కలో భారీగా వ్యత్యాసం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. దాదాపు లక్ష ధాన్యం బస్తాలు తేడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో మరోమారు మిల్లులో సోదాలు నిర్వహించేందుకు రానున్నట్లు సమాచారం.

గద్వాల: జిల్లాలో నందిన్నె రైస్‌మిల్లుకు ప్రభుత్వం నుంచి మూడు సీజన్లలో సుమారు రూ.50 కోట్ల విలువైన ధాన్యాన్ని మర ఆడించేందుకు ఇవ్వగా.. సదరు మిల్లు యజమాని ఎంచక్కా దొంగ మార్గంలో బ్లాక్‌మార్కెట్‌కు తరలించి రూ.కోట్లు వెనకేసుకున్నాడు. దీంతో జిల్లాలోనే సదరు రైస్‌మిల్లు పేరు అక్రమాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచింది. గత నెల ధాన్యంలోడు లారీని అక్రమంగా కర్ణాటకకు తరలిస్తుండగా గ్రామస్తులు పట్టుకుని అధికారులకు అప్పగిస్తే.. సదరు రైస్‌మిల్లు ఓనర్‌పై విచారణ చేపట్టిన అధికారులు కేసు నమోదు చేశారు. తాజాగా విజిలెన్స్‌ అధికారులు రెండు రోజులపాటు సోదాలు చేయగా.. మరిన్ని వివరాలు బయటకు వస్తున్నాయని సమాచారం.

తుది నివేదిక

ఆధారంగా చర్యలు

గత నెల 15వ తేదీన ఽఅర్ధరాత్రి ప్రభుత్వ ధాన్యాన్ని లారీలో తరలిస్తున్న సంఘటనపై విచారణ జరిపి కేసు నమోదు చేశాం. సదరు రైస్‌మిల్లు ఓనర్‌కు షోకాజ్‌ నోటీసు ఇచ్చాం. ప్రస్తుతం విజిలెన్స్‌ విచారణ జరుగుతుంది. తుదినివేదిక ఆధారంగా మిల్లు, ఓనర్‌పై చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఈనెల 11వ తేదీన బోల్తాపడిన లారీలో ధాన్యం ఉన్నట్లు గుర్తించాం. దీనిని కూడా విజిలెన్స్‌ విచారణకు పంపించాం. రైస్‌మిల్లర్‌ సహకారం అందిస్తున్న ప్రభుత్వ అధికారులపై సైతం విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం.

– వి.లక్ష్మీనారాయణ, అదనపు కలెక్టర్‌

యథేచ్ఛగా ధాన్యం పక్కదారి..

● నందిన్నె రైస్‌ మిల్లు యజమానిపై ఆది నుంచి ఆరోపణలు గుప్పుమంటున్నాయి.

● 2023 మే 27వ తేదీన నందిన్నె రైస్‌మిల్లులో ధాన్యం పక్కదారి పట్టిందనే ఆరోపణలతో విజిలెన్స్‌ అధికారులు సోదాలు చేశారు. దీంతో ధాన్యం అక్రమంగా తరలించినట్లు తేల్చారు.

– గత నెల జూలై 15వ తేదీన నందిన్నె రైస్‌ మిల్లు నుంచి అర్ధరాత్రి వేళ అక్రమంగా ధాన్యం లారీ లోడు కర్నాటకకు తరలిస్తుండగా గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీనిపై కేసు నమోదు చేసిన అధికారులు మరింత లోతైన విచారణకు విజిలెన్స్‌కు అప్పగించారు.

● ఈనెల 14వ తేదీన గంగన్‌పల్లి గోదాం నుంచి అక్రమంగా ధాన్యం బస్తాల లోడు లారీని అక్రమంగా కర్ణాటకకు తరలిస్తుంటే వెంకటాపురం–ఇర్కిచేడు మధ్య మెట్టుబండ వద్ద రోడ్డుపక్కన బోల్తా పడింది. గమనించినన గ్రామస్తులు వివరాలను ఫొటోతో సహా సదరు మండల అధికారులకు సమాచారం అందించారు. అయితే బియ్యం తవుడును తీసుకెళ్తున్నామంటూ అధికారులను బోల్తా కొట్టించి బోల్తాపడిన లారీని కర్ణాటకకు తరలించి దర్జాగా చేతులు దులిపేసుకున్నారు. ఈవ్యవహారంపై అధికారులు ఆరా తీస్తున్నారు.

గత నెల అర్ధరాత్రి ధాన్యం లారీ తరలింపులో మిల్లు యజమానిపై కేసు

సోదాల్లో లక్ష వరకు ధాన్యం బస్తాలు మాయం?

మూడు సీజన్లలో మిల్లుకు రూ.50 కోట్ల ధాన్యం కేటాయింపు

గంగన్‌పల్లి గోదాం నుంచి కర్ణాటకకు అక్రమమార్గంలో తరలింపు

ఇటీవల ధాన్యం లారీ బోల్తా.. ఆరా తీస్తున్న అధికారులు

ప్రభుత్వ పెద్దల సాయం..

ప్రభుత్వ ధాన్యం పక్కదారి పట్టిస్తున్న సదరు రైస్‌మిల్లు యజమాని అక్రమాల నుంచి తప్పించుకునేందుకు ఏకంగా ప్రభుత్వంలోనే పెద్దల సాయం తీసుకున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. పైగా ఆమ్యామ్యాలకు అలవాటుపడిన ఓ జిల్లా స్థాయి అధికారి రైస్‌మిల్లర్‌కు కొమ్ము కాస్తున్నట్లు బహిరంగంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

బిగుస్తున్న ఉచ్చు.. 1
1/2

బిగుస్తున్న ఉచ్చు..

బిగుస్తున్న ఉచ్చు.. 2
2/2

బిగుస్తున్న ఉచ్చు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement