ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం
నియోజకవర్గానికి 3500 చొప్పున ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఇవి వివిధ దశాలలో కొనసాగుతున్నట్లు వివరించారు. సమగ్ర భూసమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం భూభారతి చట్టం 2025 తీసుకొచ్చి ప్రభుత్వ భూములను పరిరక్షించడంతో పాటు, దీర్ఘకాలిక భూసమస్యలకు పరిష్కారం చూపనున్నట్లు తెలిపారు. జూన్ 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిగతా రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను నిర్వహించి రెవెన్యూ సమస్య రహిత తెలంగాణగా తీర్చిదిద్దుటకు ప్రణాళికలు తయారు చేసుకుని అమలు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 43,670భూసమస్యలు పరిష్కరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ మల్లురవి, కలెక్టర్ బీఎం సంతోష్, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, విజయుడు, ఎస్పీ శ్రీనివాస్‌రావు, అదనపు కలెక్టర్లు వి.లక్ష్మీనారాయణ, నర్సింగ్‌రావు, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం


