ఉచితం పేరుతో దందా | - | Sakshi
Sakshi News home page

ఉచితం పేరుతో దందా

May 6 2025 12:28 AM | Updated on May 6 2025 12:28 AM

ఉచితం పేరుతో దందా

ఉచితం పేరుతో దందా

రాజోళి: తుంగభద్ర నది నీటి కోసం గతంలో రెండు ప్రాంతాల వారు ఘర్షణ పడిన సంగతి తెలిసిందే. అప్పటి అధికారులు, యంతాంగ్రం ఆ సమస్యపై పెద్దగా స్పందించకపోవడంతోనే ఘర్షణ జరిగిందని నాటి ప్రత్యక్ష సాక్ష్యులు నేటికి చెబుతుంటారు. ప్రస్తుతం అదే ప్రాంతాల నడుమ మరో సమస్యపై వివాదం ముదురుతోంది. గతంలో తుంగభద్రలో నీటి కోసం కాగా.. ఇప్పుడు కూడా అదే నదిలో ఇసుక కోసం వివాదం జరుగుతుంది. ఇప్పుడు కూడా అధికారులు మౌనంగా ఉండటంతో జిల్లాకు నష్టం వాటిల్లుతుందని, జిల్లా ప్రయోజనాలను మరిచి ఏపీ అధికారుల తీరుపై కనీసం నోరు మెదపకపోవడంపై జిల్లా ప్రజలు కూడా ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు.

తూర్పు గార్లపాడు శివారులో కర్నూల్‌–గద్వాల మధ్యలో వివాదానికి కేంద్రంగా మారిన సరిహద్దు

రెండు ప్రాంతాల

నడుమ ఒకే నది

రాష్ట్రంలోని గద్వాల జిల్లా.. ఏపీలోని కర్నూల్‌ జిల్లాలో తుంగభద్ర నది ప్రవహిస్తుంది. ఈ క్రమంలో నదిలో నీటిని కలిసి తాగుతున్నామని, అందులో ఉన్న వనరులను పంచుకునే క్రమంలో పరిమితులు విధిస్తూ ఒక ప్రాంతం వారికి అన్యా యం చేయడం తగదని జిల్లా వాసులు అంటున్నారు. రెండు ప్రాంతాల మధ్య ఉన్న ఒకే నది ద్వారా ఎలాంటి వివాదాలు లేకుండా చూడాల్సిన అధికార పార్టీలే ఈ సమస్యను పరిష్కరించకుండా వదిలేస్తే మున్మందు సమస్య తీవ్రత పెరిగే అవకాశముందని జిల్లా వాసులు అంటున్నారు.

ఇదిలా ఉండగా ఏపీలో ఉచిత ఇసుక పేరుతో కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటితోపాటుగా నది పరివాహకంలోని అన్ని గ్రామాల్లో ఇసుకను తోడి ఉచితం పేరుతో టిప్పర్లలో తరలించి దందాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అనుమతులు ఉంటే రాత్రిళ్ల సమయంలో ఇసుక రవాణా చేయాల్సిన పరిస్థితి ఏంటనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఉచితం ఏపిలో మాత్రమే ఉండగా, ఏపి నుంచి తెలంగాణలోకి వాహనాలు రావడం ఏంటని, దాని వెనుక ఎవరున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నదిలోకి వెళ్లగానే హద్దు పేరుతో దాడులు చేసి కేసులు, జరిమానాలు విధించే, ఏపి అధికారులు హద్దులు దాటి వచ్చి దందాలు చేస్తున్న ఏపీ వాహనాలు ఎందుకు కనిపించడం లేదని జిల్లా వాసులు అంటున్నారు. ఏపీ వాహనాలు జిల్లాలో చేస్తున్న దందాను జిల్లా అధికారులు కూడా ఎందుకు పట్టించుకోవడం లేదని అంటున్నారు.

జిల్లాలో నది తీర గ్రామాల్లో భాగంగా రాజోళి మండలం తూర్పు గార్లపాడు, చిన్నధన్వాడ, మానవపాడు మండలంలోని మద్దూరు గ్రామాల్లో మన ఇసుక వాహనాలు నడుస్తుండగా.. జిల్లాలోని తుంగభద్ర నది పరివాహక గ్రామాల్లోని ఏపీ వైపున నుంచి ఈ గ్రామాలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తుమ్మిళ్ల గ్రామంలో నేటికి మర బోట్ల ద్వారా ఇసుకను జిల్లా సరిహద్దులోకి వచ్చి తీస్తున్నా జిల్లా అధికారులు పట్టించుకోవడం లేదు. కానీ ఇప్పటికే తూర్పు గార్లపాడులోని ఇసుక రీచ్‌కి వెళ్లిన జిల్లా ట్రాక్టర్లపై ఏపీ అధికారులు రెండు సార్లు కేసులు నమోదు చేసి జరిమానాలు విధించారు. ఇలా ప్రకృతి వనరులపై అజమాయిషీ చేస్తున్నా.. రోజురోజుకు వివాదం ముదరుతున్నా అధికార పార్టీ, ప్రభుత్వ పెద్దలు నోరుమెదపకపోవడం, చర్యలు తీసుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు, ఇరు ప్రాంతాల అధికారులు ఈ సమస్యకు పరిష్కారం చూపాలని, లేకపోతే వివాదం మరింత ముదిరే ప్రమాదముందని జిల్లా వాసులు అంటున్నారు. ఇదిలాఉండగా, నదిలో నెలకొన్న సమస్యను జిల్లా మైనింగ్‌ శాఖ అధికారి దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేయగా.. పలుమార్లు ఫోన్‌ చేసినా ఆయన స్పందించలేదు.

ప్రకృతి వనరులపై అజమాయిషీ

జిల్లా సరిహద్దులోకి వచ్చి ఇసుక తోడుతున్న ఏపీ ప్రాంతంవారు

ఉచితం పేరుతో ప్రకృతి వనరులను కొల్లగొడుతున్న ఇసుక మాఫియా

జిల్లా ట్రాక్టర్‌ యజమానులపై ఏపీ అధికారుల కేసులు, బెదిరింపులు

నోరు మెదపని జిల్లా అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement