400 ఏళ్ల చరిత్ర
జడ్చర్ల టౌన్: పాలవాది వంశస్థులు కావేరమ్మపేట ఈదమ్మ ఆలయం ఎదురుగా 400 ఏళ్ల క్రితం గచ్చుబావి నిర్మించారు. కాలక్రమేణా గచ్చుబావి చెత్తాచెదారంతో నిండిపోగా ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి జయపాల్ అనే యూట్యూబర్, వార్డు కౌన్సిలర్ బుక్క మహేష్ స్పందించి పరిరక్షణ కోసం చర్యలు చేపట్టారు. అలాగే జడ్చర్లలోని వేంకటేశ్వరస్వామి ఆలయం పక్కన దాదాపు 10వ శతాబ్దంలో నిర్మించిన కోనేరు శిథిలావస్థకు చేరింది. ప్రస్తుతం ఈ కోనేరు పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. కోనేరుకు ఎంతో విశిష్టత ఉంది. కోనేరుకు ఒకవైపు శివాలయం, మరోవైపు ఆంజనేయస్వామి ఆలయాలు ఉన్నాయి. కోనేరులోంచి నేరుగా పైఆలయాలకు వెళ్లేలా సొరంగ మెట్ల మార్గాలు నిర్మించారు. ఒకవైపు మాత్రమే మెట్లు ఉండగా.. రెండు వైపులా గోడలున్నాయి. ప్రస్తుతం కోనేరు పునరుద్ధరణ పనులు చురుకుగా కొనసాగుతున్నాయి.
కావేరమ్మపేటలోని గచ్చుబావి


