శిథిలం నుంచి సుందరీకరణ
మక్తల్: మక్తల్‌లో ప్రసిద్ధిగాంచిన పడమటి ఆంజనేయస్వామి దేవాలయంలో శిథిలాస్థకు చేరిన కోనేరు సుందరీకరణ దిశగా పయనిస్తోంది. గతంలో ఇదే కోనేరు నుంచి తీసుకెళ్లి ఆంజనేయస్వామికి పుష్కర స్నానం చేయించి పూజలు చేసేవారు. కాలక్రమంలో ఎవరూ పట్టించుకోకపోవడంతో శిథిలావస్థకు చేరి.. చెత్తాచెదారంతో నిండిపోయింది. ఈ క్రమంలో కోనేరు దుస్థితిని గమనించిన రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి సొంత నిధులు రూ.60 లక్షలు వెచ్చించి.. మరమ్మతు పనులు చేపట్టారు. ప్రస్తుతం కోనేరు పూర్వవైభవం సంతరించుకోగా.. భక్తులు స్నానాలు ఆచరించేందుకు సౌకర్యాలు కల్పించారు.
మక్తల్‌లో పూర్వవైభవం సంతరించుకున్న కోనేరు


