జిల్లా జడ్జిని కలిసిన కలెక్టర్
గద్వాల క్రైం: జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్.ప్రేమలతను శనివారం కలెక్టర్ సంతోష్‌కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. రెవెన్యూ, భూ సంబంధ, ఇతరరాత్ర కేసుల పరిష్కారంలో సలహాలు, సూచనలు న్యాయమూర్తిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రధాన న్యాయమూర్తికి కలెక్టర్ పూల మొక్కను అందజేశారు.
రేపటి నుంచి
రెవెన్యూ సదస్సులు
ఇటిక్యాల: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూ భారతి చట్టంపై ఈ నెల 5వ తేదీ నుంచి 16వ తేది వరకు మండలంలోని అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు తహసీల్దార్ భద్రప్ప శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 5న గోపల్‌దిన్నే, 6న వావిలాల, 7న పెద్దదిన్నె, 8న సాతర్ల , 9న ఎం.ఆర్ చెర్వు, 11న షాబాద్, 13న మునుగాల, 16న ఉదండాపురంలో సదస్సులు నిర్వహించి అక్కడే ప్రజల నుంచి భూ సమస్యలకు సంబందించిన దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపారు.
దరఖాస్తుల వెల్లువ
అయిజ: లే అవుట్ క్రమబద్ధీకరణ పథకంలో (ఎల్‌ఆర్‌ఎస్)లో ముందస్తు ఫీజు చెల్లించిన వారికి 25శాతం ప్రభుత్వం రాయితీ కల్పించడంతో మున్సిపాలిటీకి దరఖాస్తుదారులు క్యూ కట్టారు. రాయితీ పొందేందుకు శనివారం చివరి తేదీ కావడంతో భారీగా దరఖాస్తులు వచ్చాయి. మొదట ఫీజు చెల్లిస్తే ఏ సమయంలో అయినా ప్రక్రియ పూర్తిచేసుకోవచ్చనే ఉద్దేశంతో చివరిరోజు వందకుపైగా ఫీజు చెల్లించారు.
వేరుశనగ క్వింటా రూ.6,169
గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్‌యార్డుకు శనివారం 218 క్వింటాళ్ల వేరుశనగ రాగా, గరిష్టం రూ.6169, కనిష్టం రూ. 2700, సరాసరి రూ. 5969 ధరలు పలికాయి. అలాగే, 60 క్వింటాళ్ల ఆముదాలు రాగా గరిష్టం రూ.5839, కనిష్టం రూ. 5209, సరాసరి రూ. 5759 ధరలు పలికాయి. 1980 క్వింటాళ్ల వరి (సోన) రాగా గరిష్టం రూ.2026, కనిష్టం రూ. 1701, సరాసరి రూ.1729 ధరలు లభించాయి.
జిల్లా జడ్జిని కలిసిన కలెక్టర్


