మట్టి మాఫియాకు కాసుల వర్షం
ఇదిలా ఉంటే మరోవైపు చేనేత పార్కుకు కేటాయించిన స్థలంలో చాలా ప్రాంతం గుట్టలుగా ఉంది. ఈ గుట్టలు మట్టిమాఫియాకు వరంగా మారాయి. నిత్యం వందల లారీలలో మట్టిని అక్రమంగా తవ్వుతూ డబ్బులు వెనకేసుకుంటున్నారు. ఇందులో అధికార పార్టీకి చెందిన నాయకుల అనుచరులే మట్టిమాఫియా అవతారం ఎత్తిసొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఇందులో రెవెనూ, మైనింగ్, పోలీసుశాఖలోని కొందరు అవినీతి అధికారులను మచ్చిక చేసుకుని అక్రమంగా మట్టిదందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
చేనేత పార్కు స్థలంలో యథేచ్ఛగా కొనసాగుతున్న మట్టిదందా


