గద్వాల క్రైం: రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వడదెబ్బ బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు వేసవిలో ఆరోగ్యశాఖ చేపడుతున్న చర్యలపై ఇన్‌చార్జ్ డీఎంహెచ్‌ఓ సిద్ధప్పతో మంగళవారం ‘సాక్షి’ ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజలు నేరుగా ఫోన్ చేసి వడదెబ్బతోపాటు అనారోగ్య సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఏమైనా సందేహాలుంటే నివృత్తి చేసుకునే అవకాశం ‘సాక్షి’ కల్పిస్తోంది.
సిద్ధప్ప, ఇన్‌చార్జ్ డీఎంహెచ్‌ఓ
ఫోన్ చేయాల్సిన నంబర్లు : 7013959920, 9985878931
సమయం : మంగళవారం ఉదయం
11 గంటల నుంచి మధ్యాహ్నం
12 గంటల వరకు
నేడు డీఎంహెచ్‌ఓతో ‘సాక్షి’ ఫోన్ ఇన్