అయిజ: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఉపాధి కూలీలకు మేలు చేకూర్చాలని అడిషనల్ కలెక్టర్ (లోకల్‌బాడీ) నర్సింగరావు అన్నారు. శనివారం మండలంలోని సంకాపురం, బింగుదొడ్డి గ్రామాల శివార్లలో నిర్వహిస్తున్న ఉపాధి హామీ పనులను ఆయన పరిశీలించారు. ఉపాధి పనులు చేసే కూలీలకు ప్రతిరోజు రూ. 300 కూలి వచ్చే విధంగా యాక్షన్ ప్లాన్ తయారుచేసుకోవాలని సిబ్బందిని సూచించారు. కూలీలు పనిచేసే ప్రదేశాల్లో షెడ్ నెట్, మంచినీటి సదుపాయం కల్పించాలని, ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లు తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని ఆదేశించారు. ఎక్కువమంది కూలీలు పనికి వచ్చేవిధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈసందర్భంగా ఈజీఎస్ సిబ్బంది కూలీలకు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందజేశారు. ఎంపీడీఓ వెంకటయ్య, ఏపీడీ శ్రీనివాసులు, ఈజీఎస్ ఏపీఓ లాలు నాయక్, గ్రామ పంచాయతీ కార్యదర్శులు రాధాగోపాల్, రమేష్ ఉన్నారు.
కొత్తబావిని సంరక్షించాలి..
గద్వాల: గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఎదురుగా రాజుల కాలం నాటి సంస్థానాదీశులకు చెందిన (కొత్తబావి) సంరక్షించాల్సిన బాధ్యత అందిరిపై ఉందని గద్వాల క్రీడా సంఘాలు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని జిల్లా అడిషన్ కలెక్టర్ నర్సింగ్‌రావుకు వారు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ అనుమతి లేకుండా బావి చుట్టూ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించడానికి తలపెట్టిన సందర్భంలో మున్సిపల్ కమిషనర్‌కు జనవరిలో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా స్పందించకపోవడంతో మాజీ మున్సిపల్ చైర్మన్ వేణుగోపాల్ స్ధానిక రాజకీయ నాయకుల అండతో బావిని మట్టితో కూల్చడానికి కార్యచరణ చేస్తున్నారన్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని మోహన్‌రావు, శంకర ప్రభాకర్, గోపాల్, శుబాన్, నాగరాజ్, తదితరులు ఉన్నారు.