5 నుంచి పీడీఎస్‌యూ రాష్ట్ర మహాసభలు
గద్వాలటౌన్: వరంగల్ జల్లా కేంద్రంలో ఈ నెల 5 నుంచి 7వ తేదీ వరకు జరిగే పీడీఎస్‌యూ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు హలీంపాష కోరారు. గురువారం రాష్ట్ర మహాసభల పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..విద్యారంగ సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. గురుకులాలు, వసతి గృహాలలో నిత్యం ఫుడ్‌పాయిజన్ జరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ నాయకులు ఈశ్వర్, బుడ్డన్న, శ్రావ్య, దివ్య, శిరీషా, విజయ్, కల్పన, నర్సింహా పాల్గొన్నారు.


