యాసంగికి సరిపడా యూరియా నిల్వలు | - | Sakshi
Sakshi News home page

యాసంగికి సరిపడా యూరియా నిల్వలు

Jan 3 2026 7:01 AM | Updated on Jan 3 2026 7:01 AM

యాసంగికి సరిపడా యూరియా నిల్వలు

యాసంగికి సరిపడా యూరియా నిల్వలు

అలంపూర్‌: యాసంగి సీజన్‌కు సంబంధించి పంట సాగుకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియానాయక్‌ తెలిపారు. అలంపూర్‌ మున్సిపాలిటిలోని ఆగ్రోస్‌ సేవా కేంద్రాన్ని ఆయన శుక్రవారం పరిశీలించారు. అనంతరం కేంద్రంలోని యూరియాను, రికార్డులను పరిశీలించారు. ఈమేరకు ఆయన మాట్లాడుతూ.. అలంపూర్‌ మండలంలోని రైతులకు యాసంగి పంట సాగుకు కావాల్సిన యూరియా అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఆగ్రోస్‌ సేవా కేంద్రంలో ప్రస్తుతం 660 బ్యాగుల యూరియా అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. యూరియా అవసరం ఉన్న రైతులు పట్టాదారు పుస్తకం, ఆధార్‌ కార్డులతో ఎరువుల దుకాణాలకు రావాలని సూచించారు. వాటిని పరిశీలించి యూరియా ఇవ్వడం జరుగుతుందన్నారు. యూరియా కోసం రైతులు అందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అవసరం ఉన్న రైతులు అందుబాటులో ఉన్న యూరియాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా ఫర్టిలైజర్‌ దుకాణాలను ఆయన తనిఖీ చేశారు. దుకాణాల్లో రికార్డులను పరిశీలించడం జరిగింది. వీరితోపాటు మండల వ్యవసాయ శాఖ అధికారి నాగార్జున్‌ రెడ్డి తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement