మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: యూనివర్సిటీ అభివృద్ధి కోసం పూర్వ విద్యార్థుల సహకారం తీసుకోవాలని యూనివర్సిటీ చాన్స్‌లర్, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన యూనివర్సిటీల వీసీల సమావేశంలో ఆమె మాట్లాడారు. కార్యక్రమానికి పీయూ వైస్ చాన్స్‌లర్ లక్ష్మీకాంత్ రాథోడ్ హాజరయ్యారు. పూర్వ విద్యార్థుల సహకారంతో అల్యూమిన్ అసోసియేషన్లను బలోపేతం చేయాలన్నారు. వివిధ రంగాల్లో పనిచేస్తున్న పూర్వ విద్యార్థుల సహకారంతో యూనివర్సిటీలను పలు విధాలుగా అభివృద్ధి చేయవచ్చన్నారు. ల్యాబ్‌లు, మెటీరియల్స్, ఇతర సదుపాయాలను మెరుగుపర్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. పూర్వ విద్యార్థులతో ప్రస్తుత విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అంశాల్లో కూడా వారికి సహకారం తీసుకోవాలన్నారు. పీయూలో పలు అభివృద్ధి పనులు, ఎన్‌ఎస్‌ఎస్ సర్వీస్‌లపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పీయూ వీసీని గవర్నర్ సన్మానించారు.
యూనివర్సిటీ చాన్స్‌లర్,గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
వీసీ లక్ష్మీకాంత్‌రాథోడ్‌ను సన్మానిస్తున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్


