డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయాలి
అయిజ: పట్టణంలోని పీహెచ్‌సీలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయాలని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బీజేపీ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. మండలంలో మొత్తం 47 మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారన్నారు. వారందరూ గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి డయాలసిస్ చేయించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వాపోయారు. దీర్థకాలిక రోగులపై కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు. అయిజ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వెంటనే డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయని పక్షంలో ప్రజల తరఫున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు భగత్‌రెడ్డి, లక్ష్మణాచారి, ఖుషి, డయాలసిస్ బాధితులు పాల్గొన్నారు.
వేరుశనగ క్వింటా రూ.7,779
గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్ యార్డుకు గురువారం 81 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. గరిష్టం రూ.7779, కనిష్టం రూ.3419, సరాసరి రూ.7799 ధరలు లభించాయి. అలాగే, 15 క్వింటాళ్ల వరి (సోన) రాగా, గరిష్టం రూ. 2409, కనిష్టం రూ. 2309, సరాసరి ధరలు రూ. 2409 వచ్చాయి. 28 క్వింటాళ్ల కంది రాగా గరిష్టం రూ. 6509, కనిష్టం రూ. 5259, సరాసరి రూ. 6509 ధరలు లభించాయి.
మన్యంకొండకు
పాదయాత్ర
స్టేషన్ మహబూబ్‌నగర్: ధనుర్మాసాన్ని పురస్కరించుకొని నగర ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గురువారం మన్యంకొండకు మహాపాదయాత్ర చేపట్టారు. జిల్లాకేంద్రం బ్రాహ్మణవాడిలోని శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి దేవాలయం నుంచి ప్రారంభమైన పాదయాత్ర బండమీదిపల్లి, ధర్మాపూర్ మీదుగా మన్యంకొండ దేవస్థానం వరకు నిర్వహించారు. వందలాది మంది భక్తులు గోవిందనామ, హరినామ సంకీర్తనలతో పాదయాత్ర చేపట్టారు. అనంతరం భక్తులు మన్యంకొండ శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. వాసవీ ఆలయ ప్రధాన అర్చకులు గొండ్యాల రాఘవేంద్రశర్మ మాట్లాడుతూ ఇలాంటి యాత్రలు చేయడం వల్ల హిందువుల్లో ఐక్యతను పెంపొందిస్తాయన్నారు. భక్తిమార్గం దిశగా యువతను నడిపించడానికి ఇలాంటి పాదయాత్రలు చాలా ఉపయోగపడుతాయన్నారు. ధనుర్మాసంలో విష్ణు క్షేత్రాన్ని దర్శించుకోవడం మోక్షదాయకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు గుండ వెంకటేశ్వర్లు, తల్లం నాగరాజు, సూది రాము, రాఘవ, రాఘవేందర్‌శర్మ పాల్గొన్నారు.
డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయాలి
డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయాలి


