కుమారులే.. కాడ్డెదులుగా.. | Sakshi
Sakshi News home page

కుమారులే.. కాడ్డెదులుగా..

Published Mon, Jul 31 2023 1:18 AM

- - Sakshi

మహబూబ్‌నగర్‌: పుడమితల్లిని నమ్ముకున్న ఓ రైతు చివరికి కన్న కొడుకులను కాడెద్దులుగా మార్చారు. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలోని గోకులపాడుకు చెందిన అయ్యన్న ఉల్లిపంట సాగుచేశాడు.

ఇటీవల విస్తారంగా కురిసిన వర్షాలకు కలుపు ఏపుగా పెరిగింది. దీంతో కలుపుతీతకు ఇటు కూలీలు దొరకక.. అటు కాడెద్దులు లేకపోవడంతో తన ఇద్దరు కుమారులు యశ్వంత్‌, రుద్రప్రతాప్‌లను కాడెద్దుల మాదిరిగా గుంటుక కట్టి కలుపు తీశారు. ఆదివారం చంద్రశేఖర్‌నగర్‌ శివారులో కనిపించిన ఈ దృశ్యాన్ని ‘సాక్షి’ క్లిక్‌మనిపించింది. – మానవపాడు

Advertisement
 
Advertisement
 
Advertisement