న్యూస్‌రీల్
పుస్తక పఠనాన్ని
అలవర్చుకోవాలి
భూపాలపల్లి అర్బన్: యువత సోషల్ మీడియా, చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ పుస్తక పఠనానికి అలవాటు పడాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు శుక్రవారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఘనంగా ముగిశాయి. గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు అధ్యక్షతన జరిగిన ముగింపు వేడుకలకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్ శర్మ ముఖ్య అతిథులుగా హాజరై వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రంథాలయాలు జ్ఞాన భాండాగారాలని, సెల్‌ఫోన్లు, సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. పుస్తక పఠనంతో మేధస్సు, జ్ఞాపకశక్తి పెరుగుతాయన్నారు. స్పష్టమైన లక్ష్యంతో నిరంతరం చదివితే ఉన్నతస్థాయికి చేరుకోవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ ఉదయ్‌కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.
తాడిచర్ల పీహెచ్‌సీ తనిఖీ
మల్హర్: తాడిచర్ల ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) డాక్టర్ మధుసూదన్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీలో సిబ్బంది హాజరు రిజిస్టర్, ఓపీ కేసులు, ఇన్–పేషెంట్ల వివరాలు, మందుల నిల్వలు, ల్యాబ్ సేవలు, పారిశుద్ధ్య నిర్వహణను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కేంద్రంలో అమలవుతున్న అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాల పురోగతిపై ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ వినయ్‌భాస్కర్‌ను అడిగి తెలుసుకున్నారు. టీబీ, మాతా శిశు సంరక్షణ, వ్యాక్సినేషన్, ఎన్సీడీ స్క్రీనింగ్ వంటి కార్యక్రమాల రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సిబ్బంది తప్పనిసరిగా సమయపాలన పాటించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆస్పత్రికి వచ్చే ప్రతీ రోగికి మెరుగైన వైద్యసేవలు అందించాలని, ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో నమ్మకం పెంచేలా పనిచేయాలని సూచించారు. ఈకార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సందీప్, వైద్యసిబ్బంది ఉన్నారు.
ప్రజలపై భారం తగ్గించాలి
భూపాలపల్లి అర్బన్: రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ డిమాండ్ చేశారు. పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలను నిరసిస్తూ శుక్రవారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్‌లో సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్‌కుమార్ హాజరై మాట్లాడుతూ.. బియ్యం ధరలు విపరీతంగా పెరిగి కిలో రూ.100కు చేరుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. బ్లాక్ మార్కెట్ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వంటనూనె, పప్పులు, చక్కెర తదితర నిత్యావసర సరుకుల ధరలు కూడా సామాన్యులకు భారంగా మారా యని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి గురిజేపల్లి సుధాకర్ రెడ్డి, పట్టణ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్, నాయకులు నూకల చంద్రమౌళి, వేముల శ్రీకాంత్, నేరెళ్ల జోసెఫ్ పాల్గొన్నారు.
విద్యాప్రమాణాల
పెంపునకు చర్యలు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతోపాటు మెరుగైన వసతులు కల్పించాలని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో సూచించారు. శుక్రవారం మండలంలోని మేడారం ఇంగ్లిష్ మీడియం ఆశ్రమ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
కాళేశ్వరం: ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన గంజాయి మత్తు పదార్థాల వినియోగం.. ప్రస్తుతం పల్లెలకూ పాకుతోంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ యువత గంజాయికి ఆకర్షితులవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. సరదాగా మొదలవుతున్న అలవాటు క్రమంగా వ్యసనంగా మారి విద్యార్థులు, యువత జీవితాలను అంధకారంలోకి నెడుతోంది. ఉన్నత చదువులు చదివి జీవితంలో స్థిరపడాల్సిన యువత మత్తు మాయలో పడి తమ భవిష్యత్‌ను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. పిల్లలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల కలలు కల్లలవుతున్నాయి.
ప్రతీ గ్రామంలో పోలీసుల నిఘా..
గంజాయి, గుడుంబా తదితర మత్తు పదార్థాల నియంత్రణకు పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. పాఠశాలలు, కళాశాలలతో పాటు ప్రతీ గ్రామంలో పోలీసు వ్యవస్థ ద్వారా నిఘా పెంచారు. యువత, విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నారు. భవిష్యత్‌లో మత్తుపదార్థాల వినియోగం మరింత పెరగకుండా ముందస్తు నివారణ చర్యలు చేపడుతున్నట్లు తెలుపుతున్నారు.
కమ్యూనిటీ కాంటాక్ట్‌తో అవగాహన..
గంజాయి, గుడుంబా తదితర మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. ప్రతీ నెల రెండు మూడు సార్లు ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాల ద్వారా యువతకు, గ్రామస్తులకు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని వివరిస్తున్నట్లు తెలిపారు. అనుమానాస్పద కార్యకలాపాలపై సమాచారం అందించాలని ప్రజలకు సూచిస్తున్నారు.
ఒకరికి పాజిటివ్
మహదేవపూర్ మండలం అంబట్‌పల్లి గ్రామంలో గంజాయి వినియోగిస్తున్నట్లు అనుమానం ఉన్న నలుగురిని గుర్తించి శుక్రవారం భూపాలపల్లిలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఎస్సై మచ్చ సాంబమూర్తి తెలిపారు. కేసు నమోదు చేసి, డీ–అడిక్షన్ కేంద్రం ద్వారా కౌన్సెలింగ్, వైద్యచికిత్స, పునరావాస సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
జిల్లాలోని పలు ప్రాంతాల్లో పోలీసులు నిర్వహిస్తున్న తనిఖీల్లో గంజాయి వినియోగిస్తున్న యువకులు, విద్యార్థులు పట్టుబడుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈనెల 13న మహాముత్తారం మండలంలో ఇద్దరికి, 18న కాటారం మండలం దామెరకుంటలో ఐదుగురు, ఇబ్రహీంపల్లిలో నలుగురు, 19న కాటారం మండలకేంద్రంలో ఒకరు, మహదేవపూర్ మండలం కుదురుపల్లిలో ఇద్దరికి పాజిటివ్‌గా నిర్ధారణ జరిగింది. మండలాల్లోని పలు గ్రామాల్లో గంజాయి వినియోగిస్తున్నట్లు అనుమానించిన పలువురికి ప్రత్యేక కిట్టు ద్వారా భూపాలపల్లి జీజీహెచ్‌లో పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. దీంతో వారిపై కేసులు నమోదు చేశారు. జిల్లాలో ఇప్పటివరకు పలువురు యువకులు ఇలాంటి తనిఖీల్లో పట్టుబడి డీ–అడిక్షన్ కేంద్రాల్లో చికిత్స, కౌన్సెలింగ్ పొందుతున్నారు. సరైన వైద్యం, కుటుంబ సభ్యుల సహకారంతో కొందరు తిరిగి సాధారణ జీవన విధానంలోకి వస్తున్నారని పోలీసులు వెల్లడిస్తున్నారు.
భూపాలపల్లి: జిల్లాలో వైద్యశాలలు, వైద్యకేంద్రాల నిర్వహణలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, అర్హతకు మించి వైద్యసేవలు అందిస్తూ ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రాహుల్‌శర్మ హెచ్చరించారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా వైద్య సంస్థల నమోదు ప్రాధికార కమిటీ సమావేశంలో పలు అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 64 వైద్య సంస్థలు నమోదై ఉన్నాయని, వీటిలో 17 ప్రభుత్వ, 47 ప్రైవేట్ వైద్యసంస్థలు ఉన్నాయన్నారు. జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కొందరు గ్రామీణ వైద్యులు తమకు ఉన్న అర్హత, పరిధికి మించి వైద్యసేవలు అందిస్తే చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఎంహెచ్‌ఓ డాక్టర్ మధుసూదన్, డీసీఆర్బీ డీఎస్పీ అబ్దుల్ రహమాన్, ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీదేవి, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ కేఎస్ కిరణ్ పాల్గొన్నారు.
ప్రత్యేక అధికారుల నియామకం..
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం పకడ్బందీగా అమలు చేసి, అర్హులైన ప్రతీ కుటుంబానికి బీమా ప్రయోజనం అందించేందుకు కలెక్టర్ రాహుల్ శర్మ ప్రత్యేక అధికారులను నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. పథకం అమలును సమన్వయం చేసేందుకు అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలను జిల్లా స్థాయి నోడల్ అధికారిగా నియమించారు. మంథని నియోజకవర్గానికి సబ్ కలెక్టర్ సౌరభ్ శర్మ, భూపాలపల్లి నియోజకవర్గానికి ఆర్డీఓ పి.హరికృష్ణను నియోజకవర్గ నోడల్ అధికారులుగా నియమించినట్లు తెలిపారు.
సురక్షిత్ స్థాయిని సాధించడం అభినందనీయం..
ఎయిడ్స్ నివారణ కార్యక్రమంలో జిల్లా ‘సురక్షిత్’ స్థాయిని సాధించడం అభినందనీయమని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. కలెక్టర్ చాంబర్‌లో కలెక్టర్ రాహుల్ శర్మను తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఉప సంచాలకురాలు ఇందిరా ప్రియదర్శిని, డీఎంహెచ్‌ఓ డాక్టర్ మధుసూదన్, ఇతర అధికారులు శాలువాతో సత్కరించి అభినందించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో హెచ్‌ఐవీ, ఎయిడ్స్ నివారణ, నియంత్రణ కార్యక్రమాల అమలులో వైద్య ఆరోగ్య శాఖ, కార్యక్రమ నిర్వహణ అధికారులు, సమగ్ర పరీక్షా కేంద్రాలు, స్వచ్ఛంద సంస్థలు, దిశా సిబ్బంది సమన్వయ కృషి వల్లే ఈ గుర్తింపు సాధ్యమైందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, కార్యక్రమ ప్రోగ్రాం అధికారి డాక్టర్ సందీప్, దిశా జిల్లా కార్యక్రమ నిర్వాహకురాలు జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలోని వైద్యశాలల నిర్వహణపై చర్చిస్తున్న కలెక్టర్ రాహుల్‌శర్మ
తనిఖీల్లో పట్టుబడుతున్న యువత..
మత్తులో యువత చిత్తు
పోలీసుల తనిఖీల్లో వెలుగులోకి..
పాఠశాలలు, కళాశాలలు,
హోటళ్ల వద్ద ప్రత్యేక నిఘా
పాజిటివ్ కేసులకు డీ–అడిక్షన్
కేంద్రాల్లో చికిత్స, కౌన్సెలింగ్


