● విద్యా పరిరక్షణ కమిటీ
భూపాలపల్లి అర్బన్: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి విద్యారంగానికి కేటాయించే బడ్జెట్‌ను పెంచడంతోపాటు, తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి, సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కె.లక్ష్మినారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలను శనివారం సందర్శించి విద్యారంగ సమస్యలపై అధ్యయనం చేశారు. మొగుళ్లపల్లి మండలం ఎంపీయూపీఎస్ మేదరమెట్ల, రేగొండ మండలం ఎంపీపీఎస్ రేపాకపల్లి, భూపాలపల్లి మండలం జెడ్పీహెచ్‌ఎస్ జంగేడు పాఠశాలలను సందర్శించి సౌకర్యాలు, ఉపాధ్యాయుల కొరత, విద్యారంగ సమస్యలను పరిశీలించారు. క్షేత్రస్థాయిలో గుర్తించిన సమస్యలను క్రోడీకరించి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారితో సమావేశమై జిల్లాలోని విద్యారంగ సమస్యలపై చర్చించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తగిన నిధులు కేటాయించాలని, ఉపాధ్యాయుల కొరతను తీర్చడంతోపాటు విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యా పరిరక్షణ కమిటీ జిల్లా అధ్యక్షుడు ఎ.తిరుపతి, ప్రధాన కార్యదర్శి బి.సేవానాయక్, జిల్లా కమిటీ సభ్యులు శంకరయ్య, ప్రవీణ్, సదానందం, అంకన్న పాల్గొన్నారు.


