11వ రోజుకు చేరుకున్న సమ్మె | - | Sakshi
Sakshi News home page

11వ రోజుకు చేరుకున్న సమ్మె

Oct 24 2026 5:47 AM | Updated on Oct 24 2026 5:47 AM

భూపాలపల్లి అర్బన్‌: కలెక్టరేట్‌ ఎదుట ఎన్‌హెచ్‌ఎం జేఏసీ ఉద్యోగులు చేపడుతున్న నిరవధిక సమ్మె శుక్రవారం నాటికి 11వ రోజుకు చేరుకుంది. ఎన్నో సంవత్సరాలుగా ప్రజారోగ్య సేవల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్‌ చేయాలని, తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్‌హెచ్‌ఎం జేఏసీ జిల్లా అధ్యక్షుడు బడితల రమేశ్‌, ప్రధాన కార్యదర్శి మధు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వెంకటేశ్‌, ఉపాధ్యక్షుడు డాక్టర్‌ రఘురాం, కోశాధికారి శ్రీను, సలహాదారులు శ్రీనివాస్‌, జిల్లా కోఆర్డినేటర్‌ ప్రవీణ్‌, డాక్టర్లు జగదీశ్‌, విజయ్‌, బాలకృష్ణ, మీడియా ఇన్‌చార్జ్‌ రాజు, కృష్ణవేణి, ఏఎన్‌ఎంలు, స్టాఫ్‌ నర్సులు, ఫార్మసీ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement