పండుగ సాయన్న జీవితం ఆదర్శనీయం | - | Sakshi
Sakshi News home page

పండుగ సాయన్న జీవితం ఆదర్శనీయం

Oct 23 2026 1:03 AM | Updated on Oct 23 2026 1:03 AM

● ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌

భూపాలపల్లి : పేదల పక్షాన నిలిచి, అణచివేత, దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన ప్రజావీరుడు పండుగ సాయన్న జీవితం నేటి తరానికి ఆదర్శమని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌ అన్నారు. గురువారం పండుగ సాయన్న జయంతి సందర్భంగా జిల్లా పోలీస్‌ కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎస్పీ తదితరులు.. పండుగ సాయన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పండుగ సాయన్న ఆశయాలకు అనుగుణంగా సమాజంలో సమానత్వం, మానవత్వం, సేవాభావాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ నరేష్‌ కుమార్‌, ఆర్‌ఐలు కాశీరాం, పూర్ణచందర్‌ పాల్గొన్నారు.

పోరాట యోధుడు పండుగ సాయన్న

భూస్వాముల దోపిడీ, ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడుతూ పేద ప్రజల పక్షాన నిలిచిన యోధుడు పండుగ సాయన్న అని అదనపు కలెక్టర్‌ అశోక్‌కుమార్‌ కొనియాడారు. గురువారం జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన పండుగ సాయన్న ముదిరాజ్‌ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. సాయన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. పేదలకు ధాన్యం పంపిణీ చేయడంతోపాటు నిరుపేద కుటుంబాల వివాహాలకు సాయం చేస్తూ ప్రజల గుండెల్లో సాయన్న చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. ఆయనను హతమార్చినప్పటికీ, పోరాట స్ఫూర్తి నేటికీ ప్రజల్లో సజీవంగా ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా యువజన సర్వీసుల శాఖ అధికారి చిర్రా రఘు, జిల్లా ముదిరాజ్‌ సంఘం అధ్యక్షుడు ఆకుల సుభాష్‌, జిల్లా మత్స్య శాఖ అధ్యక్షుడు జోరుక సదయ్య, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement