ప్రైవేట్‌ ఆస్పత్రులు నిబంధనలు పాటించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌ ఆస్పత్రులు నిబంధనలు పాటించాలి

Oct 23 2026 1:03 AM | Updated on Oct 23 2026 1:03 AM

మల్హర్‌(కాటారం): ప్రైవేట్‌ ఆస్పత్రులు తప్పనిసరిగా నింబంధనలు పాటించాలని, పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని డీఎంహెచ్‌ఓ మధుసూదన్‌ హెచ్చరించారు. గురువారం కాటా రంలోని బాలాజీ హాస్పిటల్‌, శ్రీ లక్ష్మి హాస్పిటల్‌, సాయి హాస్పిటల్‌, రఫీ హాస్పిటల్‌, సురేష్‌ హాస్పిటల్‌, రాజరాజేశ్వరి హాస్పిటల్‌లను డీంహెచ్‌ఓ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా క్లినికల్‌ ఎస్టాబ్లిష్మెంట్‌ యాక్ట్‌ రిజిస్ట్రేషన్లు, బయో–మెడికల్‌ వేస్ట్‌ నిర్వహణ, అగ్నిప్రమాద నివారణ చర్యలు, రికార్డుల నిర్వహణను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతి ఆస్పత్రిలో రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరిగా ప్రదర్శించాలని, రోగులకు కనిపించే విధంగా చికిత్స రుసుంలు, సేవల ధరల పట్టిక ఉంచాలని ఆయన సూచించారు. అగ్నిప్రమాద నివారణకు ఫైర్‌ ఎక్స్‌టింగ్విషర్లు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. అర్హత కలిగిన వైద్యులు మాత్రమే ఓపీ సేవలు అందించాలని, అనర్హులతో వైద్యం చేయించొద్దని స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో పీఓ ఏన్‌సీడీ డాక్టర్‌ దేవేందర్‌, పీఓఎంసీహెచ్‌ డాక్టర్‌ శ్రీదేవి, పీఓఎన్‌టీఈపీ సందీప్‌, హెచ్‌ఈ శ్రీదేవి, స్థానిక వైద్యాధికారి మౌనిక తదితరులు పాల్గొన్నారు.

డీఎంహెచ్‌ఓ మధుసూదన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement