భూపాలపల్లి : ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గి, ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ప్రధానంగా నీరు, విద్యుత్‌ను పొదుపుగా వినియోగించాలనికలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. తాగునీరు, సాగునీటిని అవసరమైన మేరకే వినియోగించాలని కోరారు. వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించేందుకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలన్నారు. విద్యుత్‌ను పొదుపుగా వినియోగించాలని, అవసరం లేనప్పుడు లైట్లు, ఫ్యాన్లు, ఇతర విద్యుత్ పరికరాలను ఆపివేయాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు జిల్లా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు. గ్రా మీణ, పట్టణ ప్రాంతాల్లో నీటి లభ్యతను నిరంతరం పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, నీరు, విద్యుత్ పొదుపును సామాజిక బాధ్యతగా భావించి ప్రజలంతా సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
కలెక్టర్ రాహుల్ శర్మ


