● కొనసాగుతున్న సమ్మె
భూపాలపల్లి అర్బన్: ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నిరవధిక సమ్మె పదో రోజుకు చేరింది. ఇందులో భాగంగా గురువారం ఎన్హెచ్ఎం జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు ఒంటికాలిపై ని లబడి నిరసన తెలిపారు. ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, సమస్యలకు శాశ్వత పరిష్కా రం చూ పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమ్మె కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలకు ఆటంకం కలుగుతోందని జేఏసీ నాయకులు తెలిపారు. జేఏసీ జిల్లా అధ్యక్షుడు బడితల రమేష్, ప్రధాన కార్యదర్శి మధు, వైద్యులు, ఏఎన్ఎంలు, స్టాఫ్ నర్సులు, ఫార్మసీ అధికారులు పాల్గొన్నారు.


