ఏటూరునాగారం: మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో దుర్గాదేవి నవరాత్రుల ఊరేగింపు కనులపండువగా కొనసాగింది. ఈ మేరకు గురువారం అమ్మవారి ఊరేగింపు వైభవంగా నిర్వహించారు. కళాకారులు అమ్మవారి తొమ్మిది అవతారాల వేషదారణలతో ఆకట్టుకున్నారు. సుమారు వంద మంది కళాకారులు నృత్యాలు చేస్తూ పురవీధుల్లో అమ్మవారి ఊరేగింపు నిర్వహించారు. ఈ శోభాయాత్రను తిలకించేందుకు జనం భారీగా తరలివచ్చారు. అంతేకాకుండా అమ్మవారి పాటలకు మహిళలు, చిన్నారులు కోలాటం వేస్తూ నృత్యాలు చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పెండ్యాల ప్రభాకర్, సతీష్, తదితరులు పాల్గొన్నారు.


