భూపాలపల్లి అర్బన్: జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగుల నిరవధిక సమ్మె బుధవారం నాటికి తొమ్మిదో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఎన్‌హెచ్‌ఎం జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు మౌన దీక్ష చేపట్టి, నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏళ్లుగా ఆరోగ్య శాఖలో విధులు నిర్వహిస్తూ ప్రజలకు వైద్య సేవలందిస్తున్న ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో జేఏసీ జిల్లా అధ్యక్షుడు బడితల రమేష్, ప్రధాన కార్యదర్శి మధు, ఉపాధ్యక్షుడు డాక్టర్ రఘురాం, జిల్లా కోఆర్డినేటర్ ప్రవీణ్, డాక్టర్లు జగదీశ్, విజయ్, వందన, దీప్తి, రాజు, ఫార్మసీ ఆఫీసర్ సుమన్, ఏఎన్‌ఎంలు కృష్ణవేణి, చిత్ర పాల్గొన్నారు.
9వ రోజుకు చేరిన ఎన్‌హెచ్‌ఎం
ఉద్యోగుల సమ్మె


