జిల్లాలో మిర్చి సాగు ఇలా.. (ఎకరాల్లో..)
మిర్చిపంటకు సోకుతున్న చీడలు
భూపాలపల్లి రూరల్: ప్రకతి వైపరీత్యాలు ప్రతీఏడాది వెంటాడుతుండగా.. మిర్చి రైతులకు కన్నీళ్లే దిక్కవుతున్నాయి. ఈ సారైనా కలిసి వస్తుందనే ఆశతో సాగుచేసిన రైతులకు మళ్లీ నిరాశే ఎదురయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. నెల క్రితం కురిసిన వర్షాలు, ఎల్‌నినో ప్రభావంతో మిర్చి పంటకు కొమ్మ తెగుళ్లు, ఎండు తెగుళ్లు, తెల్ల దోమ, నల్లి తెగుళ్లు ఆశించాయి. ప్రధానంగా ఆకులు పండుబారిపోతున్నాయి. దీంతో మొక్కలు ఎండిపోతున్నాయి. ఎదగని పంటకు తోడు పూత దశలో ఆశిస్తున్న తెగుళ్లు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పెట్టుబడి కూడా రాలేని పరిస్థితి నెలకొంది.
నల్ల తామర, నల్లి, తెల్లదోమ..
తెగుళ్లతోపాటు నల్ల తామర, నల్లి పురుగు, తెల్ల దోమ ఉధృతితో పంటలకు నష్టం వాటిల్లుతోంది. భూపాలపల్లి, రేగొండ, మహాముత్తారం తదితర మండలాల్లో బ్లాక్ త్రిప్స్ (నల్ల తామర పురుగు), మైట్స్ (నల్లి పురుగు) ఉధృతి ఎక్కువగా ఉంది. మిర్చి పంటకు, ఆకుముడత, తెల్ల దోమ తెగుళ్లు తాజాగా బూడిద తెగులు మొదలై దిగుబడులు భారీగా తగ్గే అవకాశం ఉన్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈఏడాది పెరిగిన సాగు..
మిర్చి సాగులో జిల్లాకు ప్రత్యేక స్థానం, పేరు ఉన్నాయి. అయితే గత ఏడాది నల్ల తామర ప్రభావంతో మిర్చి దిగుబడులు తగ్గాయి. దీనికి తోడు గిట్టుబాటు ధర లేకపోపోవడంతో రైతులు నష్టాలు చవిచూశారు.
తగ్గుతున్న మిర్చి సాగు
జిల్లాలో ఏటేటా మిర్చి సాగు తగ్గుతూ వస్తుంది. వానాకాలానికి సంబంధించి 2023లో జిల్లాలో 24,400 ఎకరాల్లో సాగు కాగా.. 2024లో 20,145 ఎకరాలు.. 2025లో కేవలం 7,360 సాగు కాగా.. ఈ సంవత్సరం ఇప్పటి వరకు 13,858ఎకరాల్లోనే మిర్చిని సాగుచేసినట్లు వ్యవసాయ రికార్డులు చెబుతున్నాయి.
వేరుకుళ్లుతో వాడిపోతున్న మొక్కలు
తాజాగా ఆశిస్తున్న పండు తెగులు
ఇప్పటికే రెండింతలు దాటిన
పెట్టుబడి ఖర్చులు
దిగుబడిపై అయోమయంలో
మిర్చిరైతులు
మండలం ఎకరాలు
మహదేవపూర్ 2,400
పలిమెల 650
మహాముత్తారం 250
కాటారం 44
మల్హర్‌రావు 1,450
చిట్యాల 2,382
టేకుమట్ల 370
మొగుళ్లపల్లి 1,016
రేగొండ 1,650
గణపురం 940
భూపాలపల్లి 2,186
కొత్తపల్లి గోరి 520


