కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో ప్రతీఏడాది విజయదశమి (శమీ) పూజ లో స్థానిక ప్రజాప్రతినిధులకు, దేవస్థానం డైరెక్టర్లకు ప్రొటోకాల్‌ను దేవాదాయశాఖ పాటిస్తుంది. కానీ మంగళవారం విజయదశమి సందర్భంగా శ్రీరామాలయం నుంచి ఉత్సవ మూ ర్తులను గోదావరి వద్దకు తీసుకెళ్లారు. అక్కడ దేవాదాయశాఖ ఆధ్వర్యంలో శమీ పూజ కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంలో స్థానిక సర్పంచ్ మోహన్‌రెడ్డి, స్థానిక డైరెక్టర్లకు కనీస మర్యాదలు పాటించకుండా ప్రొటోకాల్‌ను విస్మరించారు. దీంతో ఈ విషయంలో దేవాదా యశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు సర్పంచ్ పేర్కొన్నారు.
బీరు సీసాలతో దాడి..
ఒకరి గాయాలు
భూపాలపల్లి అర్బన్: పాత కక్షల నేపథ్యంలో బీరు సీసాలతో దాడి చేసుకున్న సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలంలోని కాశీంపల్లి గ్రామంలో బుధవా రం సాయంత్రం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. అదే గ్రామాని కి చెందిన జోరు రాజ్‌కుమార్.. బేతు రమేష్ మధ్య పాత కక్షలు ఉన్నాయి. ఈక్రమంలో ఇంటి వద్ద ఉన్న రమేష్‌ను గ్రామ సమీపంలోని పెద్దమ్మతల్లి ఆలయం వద్దకు తీసుకురమ్మని అదే గ్రామానికి చెందిన పెద్ద మనిషిని రాజ్‌కుమార్ పంపించాడు. దీంతో మాట్లాకుందామని చెప్పి సదరు పెద్ద మనిషి తన బైక్‌పైన బాధితుడు రమేష్‌ను తీసుకొచ్చారు. అప్పటికే మ ద్యం సేవిస్తున్న రాజ్‌కుమార్.. బీరు సీసాతో రమేష్‌పై దాడి చేసి కడుపులో పొడిచాడు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ బాధితుడిని వెంటనే ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్‌లోని మరో ఆస్పత్రికి తరలించారు. దాడిని అడ్డుకోబోయిన గ్రామానికి చెందిన మహేష్ అనే వ్యక్తికి సైతం తీవ్రగాయాలైనట్లు సమాచారం. ఇదే విషయమై పోలీసులతో మాట్లాడిన వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించగా.. అందుబాటులోకి రాలేదు.
నీటి ఎద్దడి నివారణకు చర్యలు
ములుగు: ఎల్‌నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరిగి వర్షాలు తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో నీటి ఎద్దడి నివారణకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోందని పంచాయతీరాజ్, గ్రా మీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు. బుధవారం వెంకటాపురం(ఎం) మండల పరి ధి పాలంపేటలోని రామప్ప చెరువు, డీఫ్లోరైడేషన్ ప్రాజెక్టును ఆమె పరిశీలించారు. రామప్ప చెరువులో ప్రస్తుతం 29 అడుగుల మేర నీటి నిల్వ ఉందని తెలిపారు. గోదావరి నుంచి నీటి ని పంపింగ్ చేసి సమీప చెరువులు, పరిసర ప్రాంతాల కుంటలకు సరఫరా చేసే అవకాశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. డీఫ్లోరైడేషన్ ప్రాజెక్టు ద్వారా ములుగు, వెంకటాపురం, గోవిందరావుపేట, మల్లంపల్లి పరిసర ప్రాంతాలతో పాటు భూపాలపల్లి జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు ఉపాధి హామీ పథకం కింద ఇంకుడు గుంతలు, ఊటకుంటలు, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం, చెరువుల పునరుద్ధరణ, బోర్ల రీచార్జ్ పనులు చేపట్టాలని సూచించారు. తాగునీటి సరఫరాకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ప్రతీ నీటి చుక్కను పొదుపుగా వినియోగించుకోవాలని కోరారు. ప్రకృతి వైపరీత్యాలపై రాజకీయాలు చేయకుండా సమష్టిగా ఎదుర్కోవాలని సీతక్క సూచించారు. రామప్ప–లక్నవరం కాలువతో పాటు ప్రత్యామ్నాయ నీటి వనరుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
అడవి పందుల బెడద
మల్హర్: మండలంలోని పెద్దతుండ్ల గ్రామంలో అడవి పందుల బెడదతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వర్షాలు లేక బోర్లు, బావుల కింద అతికష్టం మీద పండించిన వరి పంటలను అడవి పందులు రాత్రి వేళల్లో గుంపులుగా వచ్చి ధ్వంసం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతికొచ్చిన పంటను పందులు తొక్కేసి నేలమట్టం చేయడంతో రైతులు కన్నీరు పెడుతున్నారు. వర్షాభావంతో పంటలు ఎండిపోతుంటే, ఉన్న పంటను పందులు నాశనం చేయడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి అడవి పందుల బెడదను నివారించి పంటలను కాపాడాలని రైతుల కోరుతున్నారు.


